ఆ నియోజ‌క‌వ‌ర్గంలో బ్ర‌ద‌ర్స్ కి పోటీ త‌ప్ప‌దా...?

తెలంగాణ‌లో అసెంబ్లీ ఎన్నిక‌ల వేడి మొద‌లైంది.ఎవ‌రి ప్ర‌య‌త్నాలు వారు ఇప్ప‌టినుంచే చేసుకుంటున్నారు.

ఆయా నియోజ‌క వ‌ర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు.ప్రధాన పార్టీల నేత‌లు ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేశారు.

మ‌రో వైపు మునుగోడు ఉప ఎన్నిక కూడా ఉండ‌టంతో రాజ‌కీయ వేడి రాజుకుంది.ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా అసెంబ్లీ ఎన్నిక‌ల్లో టిక‌ట్ ఆశిస్తున్న నేత‌ల బలాబలాల మీద ప్రజల్లో చర్చ జరుగుతోంది.

ఓవైపు అధికారం చేజిక్కించుకోవడమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ నూత‌నోత్సాహంతో ముందుకు కదులుతోంది.మరోవైపు టీఆర్ఎస్ పార్టీ మూడోసారి అధికారం సాధించి హ్యాట్రిక్ నమోదు చేయాలని చూస్తోంది.

Advertisement
Shouldn't The Brothers Compete In That Constituency, Nizamabad MP Arvind, Former

ఇక బీజేపీ కూడా తెలంగాణ‌లో పాగా వేయాల‌ని చూస్తోంది.ఈ నేపథ్యంలో కొన్ని నియోజకవర్గాల్లో ఆయా పార్టీల తరఫున ఒకే కుటుంబంలోని వ్యక్తులు పోటీ చేయనున్నారని వార్తలు వస్తున్నాయి.

అన్నాద‌మ్ముల‌కే పోటీనాఈ క్రమంలోనే నిజామాబాద్ అర్బన్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ తనయుడు సంజయ్.

బీజేపీ తరఫున శ్రీ‌నివాస్ మ‌రో కుమారుడు ప్రస్తుత నిజామాబాద్ ఎంపీ అరవింద్ పోటీ చేయడం దాదాపు ఖాయమేనంటున్నారు.కాగా ప్రస్తుతం నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా బిగాల గణేష్ గుప్తా ఉన్నారు.2014, 2018ల్లో టీఆర్ఎస్ తరఫున ఆయన విజయం సాధించారు.అయితే గణేష్ గుప్తా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సన్నిహితుడిగా పేరుంది.

అయితే గత రెండు పర్యాయాలు గెలిచిన ఈయనపై నియోజకవర్గంలో వ్యతిరేకత ఉంద‌ని అంటున్నారు.రెండుసార్లు అధికారంలో ఉన్న పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ నిజామాబాద్ నగర అభివృద్ధికి గణేశ్ గుప్తా కృషి చేయలేదనే విమ‌ర్శ‌లూ ఉన్నాయి.

నెలలో రెండుసార్లు ఈ రెమెడీని పాటిస్తే 60 లోనూ తెల్ల జుట్టు దరిచేరదు!

అలాగే భూ కబ్జాల విషయంలోనూ ఎమ్మెల్యేపై పత్రికల్లో కథనాలు వచ్చిన విష‌యం తెలిసిందే.ఇక ఇటీవల భారీ వర్షాల‌తో ప్ర‌జ‌లు ఇబ్బందిప‌డ‌తున్నా అటువైపు చూడ‌లేద‌నే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి.

Shouldnt The Brothers Compete In That Constituency, Nizamabad Mp Arvind, Former
Advertisement

ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో బిగాల గణేశ్ గుప్తాకు సీటు ద‌క్క‌క‌పోవ‌చ్చ‌నే టాక్ వినిపిస్తోంది ఒకవేళ పోటీ చేసినా టీఆర్ఎస్ కు ఓటమి తప్పదని అంటున్నారు.నిజామాబాద్ అర్బన్ నుంచి గతంలో నాలుగుసార్లు పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ ఘనవిజయం సాధించారు. ఆ తర్వాత ఆయన టీఆర్ఎస్ లో చేరడం.

రాజ్యసభ సీటు దక్కించుకోవడం జరిగిపోయాయి.ఆ తర్వాత కేసీఆర్ వచ్చిన విభేదాలతో ఆ పార్టీ నుంచి తప్పుకున్నారు.

అయితే ఇప్పుడు డి.శ్రీనివాస్ తనయుడు మాజీ మేయర్ సంజయ్ నిజామాబాద్ బరిలో దిగడం ఖాయంగా కనిపిస్తోంది.ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తారని అంటున్నారు.

ఇక బీజేపీ తరపున సంజయ్ సోదరుడు నిజామాబాద్ సిట్టింగ్ ఎంపీ అరవింద్ లేదా మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ బరిలో దిగుతారని అంటున్నారు.ఒక‌వేళ అన్న‌ద‌మ్ములు బ‌రిలోకి దిగితే సంజ‌య్ గెలిచే అవ‌కాశాలు ఉన్నాయ‌ని అంటున్నారు.

అయితే ఎంపీగా ఉన్న అరవింద్ పై కూడా ప్రజల్లో వ్యతిరేకత ఉందని అంటున్నారు.

తాజా వార్తలు