కెనడా : సర్రేలోని లక్ష్మీ నారాయణ్ ఆలయ చీఫ్ కొడుకు ఇంటిపై కాల్పులు .. ఎవరి పని..?

కెనడాలోని సర్రేలో( Surrey ) భారతీయ సంతతికి చెందిన వ్యక్తి నివాసంపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరపడం కలకలం రేపుతోంది.సమాచారం అందుకున్న రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీసులు (ఆర్‌సీఎంపీ) ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

 Shots Fired At House Of Lakshmi Narayan Temple Chiefs Son In Canadas Surrey Deta-TeluguStop.com

స్థానిక లక్ష్మీనారాయణ మందిర్( Lakshmi Narayan Temple ) అధ్యక్షుడు సతీష్ కుమార్( Satish Kumar ) కుమారుడి నివాసంలో బుధవారం తెల్లవారుజామున కాల్పులు చోటు చేసుకున్నాయి.సర్రేలోని 80 అవెన్యూలోని 14900 బ్లాక్‌లోని నివాసంలో ఈ ఘటన జరిగింది.

అయితే ఈ కాల్పుల్లో ఎలాంటి ప్రాణ నష్టం కానీ, గాయపడటం కానీ జరగలేదని పోలీసులు వెల్లడించారు.సర్రే పోలీస్ మీడియా రిలేషన్స్ ఆఫీసర్ పరంబీర్ కహ్లోన్ కథనం ప్రకారం.

బుల్లెట్ రంధ్రాలతో నివాసం స్వల్పంగా దెబ్బతింది.

Telugu Canada, Hindu Temples, Lakshmiyan, Parmbir Kahlon, Royal Canadian, Satish

డిసెంబర్ 27న ఉదయం 8.03 గంటలకు , 80 అవెన్యూలోని 14900 బ్లాక్‌లోని నివాసంపై కాల్పులు జరిపిన నివేదికపై సర్రే ఆర్‌సీఎంపీ( Surrey RCMP ) స్పందించింది.ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని, పోలీసులు ఆ ప్రాంతంలోనే మోహరించి ఘటనాస్థలిని పరిశీలించారని వెల్లడించింది.

సాక్షులతో మాట్లాడుతున్నామని.సీసీటీవీ ఫుటేజ్ ద్వారా నిందితులను గుర్తిస్తామని ఆర్‌సీఎంపీ పేర్కొంది.

ఈ ఘటనపై సర్రే ఆర్‌సీఎంపీ జనరల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ విచారణ నిర్వహిస్తోంది.సంఘటనకు సంబంధించిన డాష్ కామ్ ఫుటేజ్ సహా ఎలాంటి సమాచారం వున్నా ఆర్‌సీఎంపీని సంప్రదించాల్సిందిగా సర్రే పోలీసులు( Surrey Police ) ఓ ప్రకటనలో కోరారు.

Telugu Canada, Hindu Temples, Lakshmiyan, Parmbir Kahlon, Royal Canadian, Satish

నిందితుల వివరాలు ఇంకా తెలియరాలేదు.అయితే లక్ష్మీనారాయణ్ మందిర్‌కు ఇటీవల వచ్చిన బెదిరింపులకు , తాజా కాల్పుల ఘటనకు సంబంధం వుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.అయితే దీనిని సర్రే పోలీసులు ఇంకా ధృవీకరించలేదు.సర్రే ప్రాంతంలో ఖలిస్తాన్ మద్ధతుదారులు( Khalistan Supporters ) హిందూ ఆలయాలను టార్గెట్ చేస్తున్న సంగతి తెలిసిందే.ఆలయ గోడలపై భారత వ్యతిరేక రాతలు రాయడంతో పాటు కెనడాలోని భారతీయ దౌత్య సిబ్బందిపై బెదిరింపులకు పాల్పడ్డారు.ఇలాంటి పరిస్ధితుల్లో ఈ ఘటన స్థానిక ఇండియన్ కమ్యూనిటీని కలవరపాటుకు గురిచేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube