కెనడా : సర్రేలోని లక్ష్మీ నారాయణ్ ఆలయ చీఫ్ కొడుకు ఇంటిపై కాల్పులు .. ఎవరి పని..?

కెనడాలోని సర్రేలో( Surrey ) భారతీయ సంతతికి చెందిన వ్యక్తి నివాసంపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరపడం కలకలం రేపుతోంది.

సమాచారం అందుకున్న రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీసులు (ఆర్‌సీఎంపీ) ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

స్థానిక లక్ష్మీనారాయణ మందిర్( Lakshmi Narayan Temple ) అధ్యక్షుడు సతీష్ కుమార్( Satish Kumar ) కుమారుడి నివాసంలో బుధవారం తెల్లవారుజామున కాల్పులు చోటు చేసుకున్నాయి.

సర్రేలోని 80 అవెన్యూలోని 14900 బ్లాక్‌లోని నివాసంలో ఈ ఘటన జరిగింది.అయితే ఈ కాల్పుల్లో ఎలాంటి ప్రాణ నష్టం కానీ, గాయపడటం కానీ జరగలేదని పోలీసులు వెల్లడించారు.

సర్రే పోలీస్ మీడియా రిలేషన్స్ ఆఫీసర్ పరంబీర్ కహ్లోన్ కథనం ప్రకారం.బుల్లెట్ రంధ్రాలతో నివాసం స్వల్పంగా దెబ్బతింది.

"""/" / డిసెంబర్ 27న ఉదయం 8.03 గంటలకు , 80 అవెన్యూలోని 14900 బ్లాక్‌లోని నివాసంపై కాల్పులు జరిపిన నివేదికపై సర్రే ఆర్‌సీఎంపీ( Surrey RCMP ) స్పందించింది.

ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని, పోలీసులు ఆ ప్రాంతంలోనే మోహరించి ఘటనాస్థలిని పరిశీలించారని వెల్లడించింది.

సాక్షులతో మాట్లాడుతున్నామని.సీసీటీవీ ఫుటేజ్ ద్వారా నిందితులను గుర్తిస్తామని ఆర్‌సీఎంపీ పేర్కొంది.

ఈ ఘటనపై సర్రే ఆర్‌సీఎంపీ జనరల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ విచారణ నిర్వహిస్తోంది.సంఘటనకు సంబంధించిన డాష్ కామ్ ఫుటేజ్ సహా ఎలాంటి సమాచారం వున్నా ఆర్‌సీఎంపీని సంప్రదించాల్సిందిగా సర్రే పోలీసులు( Surrey Police ) ఓ ప్రకటనలో కోరారు.

"""/" / నిందితుల వివరాలు ఇంకా తెలియరాలేదు.అయితే లక్ష్మీనారాయణ్ మందిర్‌కు ఇటీవల వచ్చిన బెదిరింపులకు , తాజా కాల్పుల ఘటనకు సంబంధం వుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అయితే దీనిని సర్రే పోలీసులు ఇంకా ధృవీకరించలేదు.సర్రే ప్రాంతంలో ఖలిస్తాన్ మద్ధతుదారులు( Khalistan Supporters ) హిందూ ఆలయాలను టార్గెట్ చేస్తున్న సంగతి తెలిసిందే.

ఆలయ గోడలపై భారత వ్యతిరేక రాతలు రాయడంతో పాటు కెనడాలోని భారతీయ దౌత్య సిబ్బందిపై బెదిరింపులకు పాల్పడ్డారు.

ఇలాంటి పరిస్ధితుల్లో ఈ ఘటన స్థానిక ఇండియన్ కమ్యూనిటీని కలవరపాటుకు గురిచేసింది.

2024 దీపావళి పండగ బ్లాక్ బస్టర్ హిట్ ఏది.. ఈ ప్రశ్నకు క్లారిటీ వచ్చేసిందిగా!