జీ మెయిల్ లో ఉన్న షార్ట్ కట్ ఆప్షన్స్ మీకు తెలుసా..?!

మనలో చాలా మంది కూడా స్మార్ట్ ఫోన్ మీద బాగా ఆధారపడి జీవిస్తున్నారు.ఈ ఆధునిక యుగంలో ప్రతి మనిషి జీవితంలోనూ స్మార్ట్ ఫోన్ అనేది ఒక భాగంలా మారిపోయింది.

 Shortcut Options In Gmail Gmail, Short Cuts, Google, Technology Updates, Latest-TeluguStop.com

అయితే స్మార్ట్ ఫోన్ ఉపయోగించాలంటే ప్రతి ఒక్కరికీ జీమెయిల్ అకౌంట్ తప్పనిసరిగా ఉండి తీరాలిసిందే.స్మార్ట్ ఫోన్ లో ఏ పని చేయాలన్నా గాని జీమెయిల్ ద్వారానే జరుగుతున్నాయి.

మరి మనం అందరం నిత్యం ఉపయోగించే జీమెయిల్​ లో కూడా మనకు తెలియని చాలా రకాల షార్ట్​కట్స్ ఆప్షన్స్ ఉన్నాయనే విషయం మీలో చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు.మరి జీమెయిల్ లో ఉన్న ఆ షార్ట్​కట్స్ ఏంటో ఈరోజు తెలుసుకుందాం.

జీమెయిల్ లో ఉండే వినూత్న ఫార్మాటింగ్‌ కమాండ్స్‌ గురించి మీలో చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు.సాధారణంగా ఆండ్రాయిడ్‌ యాప్‌లో జిమెయిల్ లో మెయిల్ కంపోజ్‌ చేస్తున్నప్పుడు అక్కడ ఎలాంటి ఫీచర్లు లేనట్టుగా అనిపిస్తుంది.

కానీ కొత్త ఈమెయిల్‌ ను కంపోజ్ చేస్తున్నప్పుడు ఖాళీగా ఉన్నచోట కొద్దిసేపు అలాగే వేలితో నొక్కిపట్టి ఉంచితే కొన్ని టెక్స్ట్‌ ఫార్మాటింగ్‌ కమాండ్స్‌ కనిపిస్తాయి.వీటిని ఉపయోగించి మెయిల్‌లో ఏ భాగాన్నయినా బోల్డ్‌, ఇటాలిక్‌, అండర్‌లైన్‌ వంటి వాటిని ఉపయోగించుకోవచ్చు.

అలాగే టెక్స్ట్‌ వెనకాల రంగునూ వేసుకోవచ్చు, రంగు మార్చుకోవచ్చు.అలాగే మరొక ఆప్షన్ ఏంటంటే ఇన్‌బాక్స్‌లోని మెసేజ్‌లను స్నూజ్‌ చేయటానికి, అన్‌రీడ్‌ గుర్తు పెట్టుకోవటానికి ఒక తెలికైనా మార్గం కూడా ఉంది.

అది ఏంటంటే ఒక్క స్వైప్‌ తోనే వీటిని గుర్తు పెట్టుకోవచ్చు.ఇందుకోసం ముందుగా మీరు జీమెయిల్‌ యాప్‌ ను ఓపెన్‌ చేసి, ఎడమవైపున అడ్డం మూడు గీతల గుర్తును నొక్కి, సెటింగ్స్‌ ద్వారా ‘జనరల్‌ సెటింగ్స్‌‘ లోకి వెళ్లాలి.

ఇందులో ‘స్వైప్‌ యాక్షన్స్‌‘ ఫీచర్‌ను ఎంచుకొవడమే.

Telugu Gmail, Google, Short, Swipe, Ups-Latest News - Telugu

అలాగే ప్రతి ఒక్కరికి ఒకటే గూగుల్‌ ఖాతా ఉండాలని లేదు.ఇలా ఒకటి కన్నా ఎక్కువ గూగుల్‌ ఖాతాలు ఫోన్‌కు కనెక్ట్‌ చేసుకొని ఉన్నట్టయితే వేర్వేరు ఖాతాలకు మారటం కొన్నిసార్లు ఇబ్బందిగా ఉండొచ్చు.దీనికీ కూడా ఒక సులువైన మార్గముంది.

జీమెయిల్‌ యాప్‌లో ప్రొఫైల్‌ పిక్చర్‌ మీద వేలు పెట్టి, పైకి లేదా కిందికి స్వైప్‌ చేస్తే చాలు.వెంటనే వేరే ఖాతాలోకి మారిపోవచ్చు.

అలాగే  మెయిల్‌ పంపించినవారి ఐడీని కాపీ చేసుకోవాలన్నాగాని సులువైన మార్గం ఉంది.అది ఏంటంటే.

మెయిల్‌ను పంపించినవారి పేరు మీద కాసేపు అలాగే నొక్కి పట్టి ఉంచండి.అప్పుడు వారి మెయిల్‌ ఐడీతో పాటు సెండ్‌ మెయిల్‌, కాపీ ఆప్షన్లు కనిపిస్తాయి.

వీటి సాయంతో మెయిల్‌ ఐడీని కాపీ చేసుకొని వేరే వారికి షేర్‌ చేసుకోవచ్చు.అలాగే మీరు చూస్తున్న మెయిల్‌ లో టెక్స్ట్‌ మీద లాంగ్‌ ప్రెస్‌ చేసినా కాపీ, షేర్‌, సెలెక్ట్‌ ఆల్‌, వెబ్‌ సెర్చ్‌ వంటి ఆప్షన్లు కూడా కనిపిస్తాయి.

అంతేకాకుండా ప్రమోషన్స్‌ మెయిళ్లు ఇబ్బంది పెట్టకుండా ఉండలంటే జీమెయిల్‌ జనరల్‌ సెటింగ్స్‌ లోకి వెళ్లి, గూగుల్‌ అకౌంట్‌ చిరునామా ద్వారా ‘ఇన్‌బాక్స్‌ కేటగిరీ‘ని ట్యాప్‌ చేయాలి.ఇందులో స్క్రోల్‌ చేస్తూ అన్నింటికన్నా కింద ఉండే ‘ఎనేబుల్‌ టాప్‌ పిక్స్‌‘ బాక్స్‌ను అన్‌చెక్‌ చేయాలి.

అలాగే మీరు రాస్తున్న మెయిల్‌ రాస్తున్నప్పుడో.రిప్లై ఇస్తున్నప్పుడో.

ఫార్వర్డ్‌ చేస్తున్నప్పుడో మధ్యలో మరో ఎవరినైనా యాడ్‌ చేయాల్సి వస్తే.? రాయటం ఆపేసి, మెయిల్‌ పైకి వెళ్లి వారి మెయిల్‌ ఐడీని జతచేయాలిసిన పని లేకుండా జీ అని టైప్‌ చేసి వారి పేరులోని మొదటి ఒకట్రెండు అక్షరాలు టైప్‌ చేస్తే చాలు.ఆయా వ్యక్తుల ఫోన్‌ నంబరు కాంటాక్ట్స్‌లో ఉన్నట్టయితే వారి పేరు ప్రత్యేక బాక్సులో ప్రత్యక్షమవుతుంది.ప్రొఫైల్‌ పిక్చర్‌ను తాకితే నేరుగా అడ్రస్‌ ఫీల్డ్‌లో వారి ఈమెయిల్‌ ఐడీ వచ్చి చేరుతుంది.

ఈమెయిల్‌ వచ్చే నోటిఫికేషన్స్ ను,మెసేజ్‌లను విశ్లేషించి, నిజంగా అవసరమైన వాటికి సంబంధించిన నోటిఫికేషన్లను మాత్రమే అందిస్తుంది.దీన్ని ఎనేబుల్‌ చేసుకోవటానికి ముందుగా సెటింగ్స్‌ లోకి వెళ్ళి అక్కడ్నుంచి గూగుల్‌ ఖాతాను ఎంచుకోవాలి.

ఇందులో ‘నోటిఫికేషన్స్‌’ బటన్‌ను నొక్కితే ఆల్‌, హై ప్రయారిటీ ఓన్లీ, నన్‌ అనే ఆప్షన్లు కనిపిస్తాయి.వీటిల్లో హై ప్రయారిటీ ఓన్లీ ఆప్షన్‌ను ఎంచుకుంటే అవి మాత్రమే ముందుగా కనిపిస్తాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube