తెలుగు బుల్లితెర మీద బిగ్ బాస్ 6 అట్టహాసంగా స్టార్ట్ అయ్యింది.ఎంతో కాలంగా బిగ్ బాస్ లవర్స్ కొత్త సీజన్ కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు.
మరి మన తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి రెడీ అయ్యింది.వరల్డ్ వైడ్ గా బిగ్గెస్ట్ రియాలిటీ షోగా పేరు తెచ్చుకున్న బిగ్ బాస్ తెలుగులో ఐదు సీజన్స్ విజయ వంతంగా పూర్తి చేసుకుంది.
ఐదు సీజన్స్ పూర్తి అయ్యి 6వ సీజన్ లోకి అడుగుపెట్టి ఈ సీజన్ కూడా సూపర్ హిట్ అవుతుంది అని అనుకున్నారు.ఈసారి కూడా నాగార్జున నే హోస్ట్ గా చేస్తున్నాడు.
అయితే కంటెస్టెంట్స్ కారణంగా ఈసారి సీజన్ ప్లాప్ అయ్యింది.అయితే ఏదైనా కొత్తదనాన్ని మన టాలీవుడ్ కానీ తెలుగు ఆడియెన్స్ ఆదరించినట్టుగా మరెక్కడా ఆదరించరు అనే పేరు ఉంది.
ఇక బిగ్ బాస్ ను కూడా మన స్మాల్ స్క్రీన్ దగ్గర హైయెస్ట్ టీఆర్పీ రేటింగ్ ఇచ్చిన షోగా తెలుగు ఆడియెన్స్ నిలిపారు.
అయితే మొదటి నాలుగు సీజన్స్ వరకు ఓకే కానీ ఆ తర్వాత ఈ షోపై ఆసక్తి అందరిలో సన్నగిల్లింది.
ఇక ఇప్పుడు 6వ సీజన్ పరిస్థితి అయితే మరింత దారుణంగా మారిపోయింది.దీని రేటింగ్స్ చూసి అందరు షాక్ అవుతున్నారు.
అయితే ఇప్పుడు బిగ్ బాస్ 6 షో తెలుగులో మాత్రమే కాదు నేషనల్ వైడ్ గా ఒక ట్రెండింగ్ న్యూస్ వైరల్ అవుతుంది.

సోషల్ మీడియాలో షాకింగ్ గా ఒక నెగిటివ్ ట్రెండ్ గత కొన్ని గంటలుగా ఇండియా వైడ్ నెగిటివ్ టాక్ ట్రెండ్ అవుతుంది.26 వేలకి పైగా ప్లాప్ షో బిగ్ బాస్ 6 అంటూ ఒక ట్యాగ్ తో ట్రెండ్ నడుస్తుంది.ఇలా నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అవ్వడానికి కారణం సరైన ఎంటర్టైన్మెంట్ వారికి దక్కకపోవడమే అని తెలుస్తుంది.
ఇలా సీజన్ 6 మాత్రం తెలుగు ఆడియెన్స్ ను నిరాశ పరిచింది అనే చెప్పాలి.