నెట్‌ఫ్లిక్స్ యూజర్లకు షాకింగ్ న్యూస్... ఇకనుండి నో పాస్‌వర్డ్ షేరింగ్?

నెట్‌ఫ్లిక్స్ యూజర్లు మీ Netflix అకౌంట్ పాస్‌వర్డ్ మీ సన్నిహితులతో షేర్ చేసుకుంటూ బాగానే ఎంజాయ్ చేస్తున్నారు గాని, ఇక మీకు Netflix చెక్ పెట్టబోతోంది.

త్వరలో పాస్‌వర్డ్ షేరింగ్‌ విధానానికి బ్రేక్ వేయనుంది Netflix.

ఎప్పటినుండో ఇది ప్రతిపాదనలో ఉన్నప్పటికీ త్వరలో ఇది అమలు చేయనుంది.అయితే మీ స్నేహితులతో Netflix అకౌంట్ పాస్‌వర్డ్ షేర్ చేసుకోవచ్చు.

అదెలాగా అంటే అదనంగా ఛార్జీలు చెల్లించి ఎంజాయ్ చేయొచ్చు.

Shocking News For Netflix Users... No Password Sharing From Now On Netflix, Tec

ఇకపోతే, 2017లో Netflix పాస్‌వర్డ్ షేరింగ్ విధానాన్ని తీసుకొచ్చిన సంగతి విదితమే.అప్పట్లో అయితే ఎక్కువమంది వినియోగదారులను ఆకర్షించేందుకు ఈ షేరింగ్ విధానాన్ని తెచ్చింది కానీ, ఇప్పుడు, నెట్‌ఫ్లిక్స్ వినియోగదారులు తమ అకౌంట్‌ను తమతో నివసిస్తున్న యూజర్లతో కాకుండా మరెవరితోనైనా షేర్ చేస్తే అదనంగా ఛార్జీలు చెల్లించాలని కోరుతోంది.Netflix ఇప్పటికే వివిధ ప్రాంతాలలో చాలా మంది వినియోగదారులకు అదనపు ఛార్జీలు విధిస్తోంది.

Advertisement
Shocking News For Netflix Users... No Password Sharing From Now On? Netflix, Tec

ఇటీవలే ఉత్తర అమెరికా, కొన్ని ఇతర ప్రాంతాలలోని యూజర్ల నుంచి ఛార్జీలు విధించడం ప్రారంభించింది.మార్చి నెలాఖరులో యూకేలో కూడా అదే విధంగా చేయాలని నెట్‌ప్లిక్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

అయితే ఇండియాలో ప్రస్తుతానికి ఎలాంటి జాబితా అందుబాటులో లేదు కానీ, భారతీయ నెట్‌ఫ్లిక్స్ యూజర్లు దీనికి ఇక సిద్ధపడిపోవాలి.ఎందుకంటే, ఈ ప్లాట్‌ఫారమ్ 2023 మొదటి త్రైమాసికంలో పాస్‌వర్డ్ షేరింగ్‌ను నిలిపివేయనున్నట్టు తాజాగా ప్రకటించింది మరి.Netflix కి దేశంలో 5 మిలియన్ల యూజర్ బేస్ వున్న సంగతి విదితమే.చాలా మంది భారతీయులు తమ నెట్‌ఫ్లిక్స్ అకౌంట్ చాలా మంది స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేస్తున్నారు.

ఈ క్రమంలో భారతీయ యూజర్లపై కూడా నెట్‌ఫ్లిక్స్ అదనపు ఛార్జీలు విధించే అవకాశం లేకపోలేదు.అది కూడా త్వరలో జరగనుంది.

వైరల్ వీడియో.. అరె పిల్లలు అది డాన్స్ ఫ్లోర్ కాదరయ్యా.. క్రికెట్ మ్యాచ్!
Advertisement

తాజా వార్తలు