సూర్య, జ్యోతిక కాంబినేషన్ కు ఎంతోమంది అభిమానులు ఉన్నారు.కోలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీలలోని బెస్ట్ జోడీలలో ఒక జోడీగా ఉన్నారు.
అయితే సూర్య, జ్యోతిక రెండుసార్లు పెళ్లి చేసుకున్నారనే సంగతి చాలా తక్కువ మందికి తెలుసు.పలు సినిమాలలో కలిసి నటించడం వల్ల సూర్య, జ్యోతికలకు ఎంతోమంది అభిమానులు ఏర్పడ్డారు.
అయితే సూర్య, జ్యోతికను పెళ్లి చేసుకుంటానని చెప్పిన సమయంలో మొదట కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు.
జ్యోతిక సినిమా రంగానికి చెందిన హీరోయిన్ కావడంతో కుటుంబ సభ్యుల నుంచి వ్యతిరేకత రాగా ఫ్యామిలీ మెంబర్స్ కు ఇష్టం లేకపోయినా సూర్య, జ్యోతిక పెళ్లి చేసుకున్నారు.
అయితే ఈ వివాహం రహస్యంగా జరిగింది.ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలియడంతో అధికారికంగా సూర్య కుటుంబ సభ్యులకు మళ్లీ మ్యారేజ్ చేయించారు.ఈ విధంగా సూర్య, జ్యోతిక రెండుసార్లు వివాహం చేసుకోవడం గమనార్హం.
సినిమా ఇండస్ట్రీలో సూపర్ జోడీగా బెస్ట్ కపుల్ గా ఈ జోడీ గుర్తింపును సొంతం చేసుకుంది.
టాలీవుడ్ స్ట్రెయిట్ హీరోలకు సమానంగా హీరో సూర్యకు క్రేజ్ ఉండేది.అయితే ఈ మధ్య కాలంలో సూర్య తెలుగులో నటించిన సినిమాలలో ఎక్కువ సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.
సూర్య తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా రికార్డులు క్రియేట్ చేయడంతో పాటు ఫ్యాన్స్ ను ఆకట్టుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

సూర్య జ్యోతిక జోడీ ఎంతోమందికి ఫేవరెట్ కపుల్ కాగా ఈ జోడీ కాంబినేషన్ లో మరిన్ని సినిమాలు రావాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.సూర్య రెమ్యునరేషన్ కూడా భారీ స్థాయిలో పెరిగిందని సమాచారం అందుతోంది.సూర్య జ్యోతిక భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో కూడా విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
సూర్య ఒకవైపు మాస్ రోల్స్ తో మెప్పిస్తూనే మరోవైపు క్లాస్ రోల్స్ లో కూడా నటించి అందరినీ ఆకట్టుకుంటున్నారు.







