అయ్పప్ప స్వామిపై బైరి నరేశ్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో ప్రకంపనలు రేపుతున్నాయి.నరేశ్ కు వ్యతిరేకంగా అయ్యప్ప మాలధారుల ఆందోళనలు కొనసాగుతున్నాయి.
మరోవైపు బైరి నరేశ్ కు మద్ధతిస్తూ రేంజర్ల రాజేశ్ ఫేస్ బుక్ పోస్టు పెట్టారు.విజయ్ కుమార్ అనే వ్యక్తి పోస్టును రాజేశ్ చేసిన రీపోస్టు కల్లోలం సృష్టిస్తుంది.
రాంగోపాల్ వర్మ అగ్రకులస్తుడు, బైరి నరేశ్ బహుజనుడంటూ పోస్టులో పేర్కొన్నారు.నరేశ్ ను ప్రశ్నించిన వారు ఆర్జీవీని ఎందుకు నిలదీయరని ప్రశ్నించారు.
ఈ క్రమంలో తెలంగాణ వ్యాప్తంగా అయ్యప్పల ఆందోళనలు ఉధృతం కావడంతో రేంజర్ల రాజేశ్ ఇంటి నుంచి పరారైయ్యారు.







