సూపర్ స్టార్ మహేష్ బాబు ( Mahesh Babu ) సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న టాలీవుడ్ హీరోలలో ఒకరు.ఒక దశలో మహేష్ బాబు నంబర్ వన్ స్థానంలోకి వెళ్లారు.
పోకిరి, దూకుడు, శ్రీమంతుడు, భరత్ అనే నేను లాంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు మహేష్ బాబు రేంజ్ లోనే కెరీర్ తొలినాళ్లలోనే మహేష్ బాబు మురారి, ఒక్కడు సినిమాలతో భారీ విజయాలను మహేష్ బాబు ఖాతాలో వేసుకున్నారు.ప్రస్తుతం ఈ స్టార్ హీరో గుంటూరు కారం( Guntur Karam Movie ) సినిమాలో నటిస్తుండగా ఈ మూవీపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.
అయితే కొన్నిరోజుల క్రితం మహేష్ బాబు ఎండలో షూటింగ్ కు ఒప్పుకోడని మహర్షి సినిమాలోని( Maharshi Movie ) ఒక సీన్ కోసం ఏసీలతో ఉన్న సెట్ వేయించుకున్నాడని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.అయితే ఈ వార్తలకు మహేష్ ఫ్యాన్స్ ధీటుగా సమాధానం ఇచ్చారు.
మహర్షి సినిమాలో రాత్రి సమయంలో షూట్ చేసిన సన్నివేశాలకు మహేష్ కు ఏసీతో అవసరం ఏముంటుందని వాళ్లు అభిప్రాయం వ్యక్తం చేశారు.
అయితే ఎవరైతే తనపై విమర్శలు చేశారో వాళ్లకు మహేష్ బాబు గుంటూరు కారం టీజర్ తో ఒకింత ఘాటుగా సమాధానం ఇచ్చారు.గుంటూరు కారం గ్లింప్స్ షూటింగ్ అంతా ఔట్ డోర్ లో ఎండలో జరిగిందని మహేష్ కష్టానికి ఇంతకు మించి ప్రూఫ్స్ కావాలా? అని మహేష్ ఫ్యాన్స్ చెబుతున్నారు.ఇప్పుడు చెప్పండ్రా అబ్బాయిలు వాట్ టు డూ వాట్ నాట్ టూ డూ అంటూ నెగిటివ్ కామెంట్లు చేసిన వాళ్లకు మహేష్ ఫ్యాన్స్ చుక్కలు చూపిస్తున్నారు.
గుంటూరు కారం గ్లింప్స్ చూస్తుంటే ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుందనే భావనను కలిగిస్తోంది.గుంటూరు కారం సినిమాతో మహేష్ గత సినిమాలను మించి హిట్ అందుకోవాలని ఫ్యాన్స్ చెబుతున్నారు.