వామ్మో.. యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జశ్వంత్ ఆస్తుల విలువ అన్ని రూ.కోట్లా?

బిగ్ బాస్ సీజన్5 కంటెస్టెంట్, యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జశ్వంత్ గురించి ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

సోషల్ మీడియాలో కూడా షణ్ముఖ్ కు భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతుండటం గమనార్హం.

వైవా అనే షార్ట్ ఫిల్మ్ ద్వారా క్రేజ్ ను సొంతం చేసుకున్న షణ్ముఖ్ జశ్వంత్ ఆ తర్వాత తన కెరీర్ లో వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం అయితే రాలేదు.అయితే ఇండస్ట్రీకి రాకముందే షణ్ముఖ్ జశ్వంత్ కోటీశ్వరుడు కావడం గమనార్హం.

షణ్ముఖ్ ఆస్తుల విలువ 12 కోట్ల రూపాయలు అని సమాచారం.షణ్ముఖ్ కుటుంబానికి సొంతంగా పలు వ్యాపారాలు ఉన్నాయని ఆ వ్యాపారాల ద్వారా షణ్ముఖ్ భారీ మొత్తంలో ఆదాయం సొంతం చేసుకుంటున్నారని తెలుస్తోంది.

షణ్ముఖ్ జశ్వంత్ ప్రస్తుతం నెలకు 30 లక్షల రూపాయల రేంజ్ లో సంపాదిస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది.

Advertisement

యూట్యూబ్ ద్వారా ఈ స్థాయిలో సంపాదించడం సులువు కాదనే సంగతి తెలిసిందే.ఊహించని స్థాయిలో టాలెంట్ ఉండటం వల్లే షణ్ముఖ్ జశ్వంత్ భారీ మొత్తంలో ఆదాయం సంపాదిస్తున్నారని తెలుస్తోంది.ప్రస్తుతం ఆహా ఓటీటీ కోసం షణ్ముఖ్ జశ్వంత్ ఒక వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు.

ఈ వెబ్ సిరీస్ కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుండటం గమనార్హం.

షణ్ముఖ్ జశ్వంత్ సినిమాలలో కెరీర్ ను కొనసాగించాలని మరి కొందరు అభిమానులు కోరుకుంటున్నారు.షణ్ముఖ్ జశ్వంత్ కెరీర్ విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు.సాఫ్ట్ వేర్ డెవలపర్, సూర్య వెబ్ సిరీస్ ల సక్సెస్ తో షణ్ముఖ్ జశ్వంత్ కు క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతోంది.

షణ్ముఖ్, దీప్తి సునైనా మళ్లీ కలిస్తే బాగుంటుందని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.షణ్ముఖ్ కు సినిమా ఆఫర్లు కూడా ఎక్కువగానే వస్తున్నాయని సమాచారం అందుతోంది.

హమ్మయ్య! అల్లు అర్జున్ కి ఓ గండం గట్టెక్కింది... ఇక ఎంచక్కా అక్కడికి చెక్కేయొచ్చు!
Advertisement
" autoplay>

తాజా వార్తలు