ఈరోజు భూమా మౌనికతో మంచు మనోజ్ పెళ్లి గ్రాండ్ గా జరగనున్న సంగతి తెలిసిందే.ఈరోజు రాత్రి 8.30 గంటలకు పెళ్లి జరగనుండగా మనోజ్ వ్యక్తిగత జీవితం కూడా ఇకపై సంతోషంగా ఉంటుందని కామెంట్లు వినిపిస్తున్నారు.త్వరలో మనోజ్ వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నారని తెలుస్తోంది.
అయితే మంచు లక్ష్మి ఇంట్లో మనోజ్ పెళ్లి ఎందుకు జరుగుతుందనే ప్రశ్నకు సంబంధించి ఆసక్తికర సమాధానం వినిపిస్తోంది.
మంచు లక్ష్మి చాలా సందర్భాల్లో మనోజ్ అంటే తనకు చాలా ఇష్టమని మనోజ్ ను కొడుకులా చూసుకుంటానని చెప్పుకొచ్చారు.
మనోజ్ కు కెరీర్ పరంగా వ్యక్తిగత జీవితంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా మంచు లక్ష్మి అండగా నిలిచారు.మనోజ్ కు నెగిటివ్ గా ఎలాంటి వార్తలు ప్రచారంలోకి వచ్చినా మంచు లక్ష్మి అస్సలు తట్టుకోలేరు.
మనోజ్ పెళ్లి రూమర్ల విషయంలో సైతం మంచు లక్ష్మి సీరియస్ అయిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం మంచు మనోజ్ పెళ్లికి సంబంధించి కొన్ని ఇబ్బందులు, అడ్డంకులు ఉన్న నేపథ్యంలో ఆమె పెళ్లి పెద్దగా మారారు.మనోజ్ పై ఉండే ప్రేమ, అభిమానం వల్లే మంచు లక్ష్మి తన ఇంట్లో ఈ పెళ్లి వేడుక జరగడానికి ఓకే చెప్పారని సమాచారం.మనోజ్ పై మంచు లక్ష్మి చూపిస్తున్న ప్రేమకు నెటిజన్లు సైతం ఫిదా అవుతున్నారు.
మంచు లక్ష్మి మనోజ్ పెళ్లికి సంబంధించిన అన్ని పనులను దగ్గరుండి చూసుకుంటున్నారు.
భూమా మౌనిక విషయానికి వస్తే ఆమె బీటెక్ చదివింది.మొదటి భర్తతో భూమా మౌనికకు విడాకులు కాగా ఆళ్లగడ్డలో ఆమెకు ఊహించని రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.విదేశాల్లో జాబ్ వచ్చినా వదులుకున్న భూమా మౌనిక కెరీర్ పరంగా సక్సెస్ సాధించడంతో పాటు వ్యక్తిగత జీవితాన్ని ఎలాంటి సమస్యలు లేకుండా కొనసాగించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.