సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా సక్సెస్ సాధించాలంటే ఆ సక్సెస్ వెనుక ఎంతోమంది కృషి ఉంటుంది.
వరుసగా రెండు ఫ్లాప్స్ ఇచ్చిన డైరెక్టర్ డైరెక్షన్ లో నటించడానికి స్టార్ హీరోలు ఆసక్తి చూపరు.
ఒకవేళ స్టార్ హీరోలు నటించినా ఆ సినిమాలకు కొన్నిసార్లు బిజినెస్ విషయంలో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి.అయితే విచిత్రం ఏంటంటే కొన్నిసార్లు అలాంటి సినిమాలే రిలీజ్ తర్వాత సంచలనాలు సృష్టిస్తుంటాయి.
అలా మహేష్ బాబు( Mahesh Babu ) సినీ కెరీర్ లో పెద్దగా అంచనాలు లేకుండా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సినిమాలలో ఒక్కడు సినిమా( Okkadu Movie ) ఒకటి.ఎమ్మెస్ రాజు నిర్మాతగా గుణశేఖర్ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కింది.
పుల్లెల గోపీచంద్ జీవితంలోని విశేషాల ఆధారంగా గుణశేఖర్( Gunasekhar ) ఈ సినిమాను తెరకెక్కించడం గమనార్హం.ఈ సినిమాకు మొదట అతడే ఆమె సైన్యం అనే టైటిల్ ను పరిశీలించారు.
ఆ తర్వాత కబడ్డీ( Kabaddi ) అనే మరో టైటిల్ ను కూడా పరిశీలించడం జరిగింది.మేకర్స్ ఈ సినిమాకు చివరకు ఒక్కడు అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు.ఈ సినిమా మహేష్ పని గోవిందా అని కామెంట్ చేసిన వాళ్లే సినిమా విడుదలైన తర్వాత సినిమా సాధించిన ఫలితాన్ని చూసి ముక్కు మీద వేలు వేసుకున్నారు.
ఈ సినిమాలోని చార్మినార్ సెట్ కోసం ఒకింత ఎక్కువ మొత్తమే ఖర్చు చేయడం గమనార్హం.
9 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లోనే 39 కోట్ల రూపాయల కలెక్షన్లను సొంతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద హిట్ గా నిలిచింది.మహేష్ సినీ కెరీర్ లోని బిగ్గెస్ట్ హిట్లలో ఈ సినిమా ఒకటని చెప్పడంలో సందేహం అక్కర్లేదు.ఒక్కడు సినిమాతో మాస్ ప్రేక్షకుల్లో సైతం మహేష్ బాబుకు మంచి పేరు వచ్చింది.
ఈ సినిమా తర్వాత మహేష్ కెరీర్ పరంగా వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy