టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓవర్ నైట్ లో స్టార్ డమ్ ను సొంతం చేసుకున్న హీరోయిన్లలో కృతిశెట్టి( Krithi Shetty ) ఒకరు.అందం, అభినయం పుష్కలంగా ఉండటంతో పాటు ప్రేక్షకులను మెప్పించే నటనా సామర్థ్యం ఉండటంతో కృతిశెట్టి ఇతర హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తున్నారు.
ప్రస్తుతం ఈ బ్యూటీ వయస్సు 19 సంవత్సరాలు అని చెబితే నెటిజన్లు సైతం ఒకింత ఆశ్చర్యానికి గురవుతుండటం గమనార్హం.

అయితే స్టార్ హీరోయిన్ కృతిశెట్టికి సంబంధించి ఒక విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా ఆ విషయం హాట్ టాపిక్ అవుతోంది.ఒక స్టార్ హీరో కొడుకు కృతిశెట్టిని వేధించాడని ఒక వార్త సోషల్ మీడియాలో జోరుగా ప్రచారంలోకి వస్తోంది.కృతిశెట్టితో ఫ్రెండ్ షిప్( Friendship ) కావాలంటూ స్టార్ హీరో కొడుకు టార్చర్ చేస్తున్నాడని కృతికి దగ్గర కావడానికి ఆ హీరో ప్రయత్నిస్తున్నాడని వైరల్ అవుతున్న వార్తల సారాంశం.

తన పుట్టినరోజు వేడుకకు కచ్చితంగా రావాలని అవసరమైతే తాను డబ్బులు కూడా ఇస్తానని కృతికి ఆ స్టార్ హీరో కొడుకు ఆఫర్ చేశారట.తరచూ ఫోన్లు చేస్తూ కృతిని ఆ హీరో టార్చర్ చేస్తున్నట్టు కృతి ఒక తమిళ ఇంటర్వ్యూ( Krithi Shetty Interview )లో చెప్పారని వార్త ప్రచారంలోకి వస్తోంది.అయితే కృతి స్పందిస్తే మాత్రమే ఈ వార్తల్లో నిజానిజాలు తెలిసే అవకాశం ఉంటుంది.కృతి పారితోషికం ప్రస్తుతం కోటి రూపాయల రేంజ్( Krithi Shetty Remuneration ) లో ఉందని తెలుస్తోంది.

కృతి శెట్టి కెరీర్ గ్రాఫ్ తగ్గుతుండగా ఇతర ఇండస్ట్రీలలో అయినా కృతిశెట్టి సక్సెస్ సాధిస్తారేమో చూడాల్సి ఉంది.కృతిశెట్టిని అభిమానించే అభిమానుల సంఖ్య పెరుగుతోంది.కథ, కథనం అద్భుతంగా ఉన్న సినిమాలకు మాత్రమే కృతి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని కామెంట్లు చేస్తున్నారు.వచ్చే ఏడాదైనా హీరోయిన్ కృతిశెట్టికి కలిసొస్తుందో లేదో తెలియాలంటే మరి కొంతకాలం ఆగాల్సిందే.