ఒకప్పుడు సినిమా అవకాశాలు రావాలి అంటే చాలా గగనంగా ఉండేది.సెలబ్రిటీ హోదా పొందాలి అంటే టాలెంట్ ఉన్నప్పటికీ అవకాశాలు లేక ఎంతోమంది ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు.
అయితే ప్రస్తుతం అలా కాదు సినిమా ఇండస్ట్రీని టాలెంట్ ను వెతుక్కుంటూ వస్తుంది.సోషల్ మీడియా అభివృద్ధి చెందిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా వారిలో ఉన్నటువంటి టాలెంట్ బయట పెడుతూ వీడియోల రూపంలో వాటిని పోస్ట్ చేయడం ద్వారా ఎంతో మంది సెలబ్రిటీలుగా మారిపోయారు.
ఇలా సోషల్ మీడియా ద్వారా ఇండస్ట్రీలోకి వచ్చే సెలబ్రిటీలోగా గుర్తింపు పొందినటువంటి వారు ఎంతో మంది ఉన్నారు అలాంటి వారిలో నటి అరియాన( Ariyana )ఒకరు.
ఈమె యూట్యూబ్ ఛానల్ నిర్వహించి తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతో మంది సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేస్తూ పాపులర్ అయ్యారు.అయితే ఈ ఇంటర్వ్యూలలో భాగంగా సంచలనాత్మక డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మను ఇంటర్వ్యూ చేయడంతో ఒక్కసారిగా ఫేమస్ అయినటువంటి ఈమెకు ఇండస్ట్రీలో అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి.ఇలా రెండుసార్లు బిగ్ బాస్ ( Bigg Boss ) కార్యక్రమానికి వెళ్లడమే కాకుండా బిగ్ బాస్ బజ్ కార్యక్రమానికి యాంకర్ గా కూడా వ్యవహరించారు.
ఇక ప్రస్తుతం పలు బుల్లితెర కార్యక్రమాలలోనూ సందడి చేస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు.
ఇక అరియానా ఈ మధ్యకాలంలో తరచూ సోషల్ మీడియా( Social media )లో పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు.ఇంస్టాగ్రామ్ రీల్స్ ద్వారా పెద్ద ఎత్తున అభిమానులను ఆకట్టుకుంటున్నారు.తాజాగా ఎరుపు రంగు చీర ధరించి మదనా నా ప్రాణం నీదేనా అంటూ సాగే పాటకు ఎంతో అద్భుతంగా డాన్స్ పెర్ఫార్మెన్స్ చేశారు.
ఇలా ఎరుపు రంగు చీరలో మరింత అందంగా కనపడుతూ ఉన్నటువంటి ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అయితే ఈ వీడియో పై ఎంతోమంది నేటిజన్స్ వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
ఒకప్పుడు ఈమె సన్నజాజితీగల ఎంతో నాజుగ్గా ఉండేది కానీ ఈ మధ్యకాలంలో ఒక్కసారిగా శరీర బరువు పెరిగిపోయారు.దీంతో ఈమె పట్ల ఎంతోమంది పలు రకాల ట్రోల్స్ చేస్తున్నారు.ఈ వీడియోని ఈమె సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ వీడియో పై ఎంతో మంది నేటిజన్స్ స్పందిస్తూ ఒకప్పుడు ఇలియానా ( Ilieana ) కు చెల్లిగా ఎంతో సన్నగా అందంగా ఉండే దానివి కానీ ఇప్పుడు మాత్రం స్వాతి నాయుడుకి అక్క లాగా తయారయ్యావు అరియానా అంటూ ఘోరంగా కామెంట్స్ చేస్తున్నారు.నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం అంటూ ఈమె శరీర బరువు గురించి బాడీ షేమింగ్ కామెంట్స్ చేస్తూ చేస్తున్నటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఎంతో నాజుగ్గా ఉన్నటువంటి ఈమె ఉన్నఫలంగా ఇలా శరీర బరువు పెరగడానికి కారణం ఏంటి అనే విషయం తెలియకపోయినా ఈమె మాత్రం తన శరీర బరువు కారణంగా భారీగా ట్రోల్స్ ఎదుర్కొంటున్నారు.