చిన్న వయస్సులోనే బ్రహ్మర్షి విశ్వామిత్ర, బాల రామాయణం సినిమాలలో నటించిన జూనియర్ ఎన్టీఆర్ స్టూడెంట్ నంబర్ 1 ( Student No.1 )సినిమాతో సక్సెస్ సాధించిన తర్వాత అప్పటినుంచి ఇప్పటివరకు నంబర్ వన్ హీరోల రేసులో ఉన్నారు.కొన్ని సందర్భాల్లో వరుస ఫ్లాపులు ఎదురైనా జూనియర్ ఎన్టీఆర్ తన టాలెంట్ తో బౌన్స్ బ్యాక్ అయ్యారు.అయితే జూనియర్ ఎన్టీఆర్( Junior NTR ) కు కెరీర్ పరంగా లక్ కలిసిరావడానికి వీపుపై ఉన్న మచ్చ కారణమని సమాచారం.

వీపుపై మచ్చ ఉంటే అదృష్టం ఉంటుందని ఆ మచ్చ వల్ల తనకు కెరీర్ పరంగా కలిసొస్తుందని తారక్ సైతం ఫీలవుతున్నారని తెలుస్తోంది.జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ విషయానికి వస్తే దేవర, దేవర2 సినిమాల ( Devara Devara 2 movies )గురించి వేర్వేరు వార్తలు జోరుగా ప్రచారంలోకి వస్తుండటం గమనార్హం.దేవర సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో ఏ వార్త వైరల్ అయినా ఆ వార్త అభిమానులకు గూస్ బంప్స్ తెప్పించే విధంగా ఉండటం గమనార్హం.

దేవర పార్ట్1 ను మించి దేవర2 ఉండనుందని తెలుస్తోంది.కథ, కథనం అద్భుతంగా ఉండగా తెరపై ఆ సీన్లు మరింత అద్భుతంగా ఉండేలా కొరటాల శివ కష్టపడుతున్నారని ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కనుందని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.ఎన్టీఆర్ సైఫ్ మధ్య సన్నివేశాలు పోటాపోటీగా ఉంటాయని సమాచారం అందుతోంది.
ఎన్టీఆర్ రేంజ్ ను ఈ సినిమా పెంచనుందని తెలుస్తోంది.
ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కిన జనతా గ్యారేజ్ ( Janatha Garage )సక్సెస్ సాధించగా ఆ సినిమాకు పది రెట్లు దేవర ఉంటుందని భోగట్టా.
కొరటాల శివ( Koratala Shiva ) పవర్ ఫుల్ స్క్రిప్ట్ లతో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.ఎన్టీఆర్ కొరటాల శివలకు దేవర సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ దక్కడం గ్యారంటీ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
ఈ సినిమా బడ్జెట్ విషయంలో ఏ మాత్రం రాజీ పడటం లేదని తెలుస్తోంది.







