ఫరా కౌసర్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్.సింగర్ యశశ్విపై ఆరోపణలు.
తాను చేయని సేవా కార్యక్రమాలను చేసినట్లుగా ఓ టీవీ ఛానల్ లో ప్రచారం చేశాడంటూ సంస్థ నిర్వాహకురాలు ఫరా ఆవేదన వ్యక్తం చేశారు.నవ సేవ అనే పేరుతో స్వచ్ఛంద సంస్థలు స్థాపించి 56 మంది అనాధ పిల్లలను తాము సాకుతున్నామని అన్నారు.
ఇటీవల ఓ ఎంటర్టైన్మెంట్ ఛానల్లో పాటలు పాడిన యశస్వి ప్రేక్షకుల ఆదరాభిమానాలను పొందేందుకు తద్వారా సదరు కార్యక్రమం ఓట్లు రాబట్టేందుకు తాను చేయని సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు ప్రచారం చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ విషయంపై తాను నేరుగా యశస్విని సంప్రదించి క్షమాపణ చెప్పాల్సిందిగా కోరిన స్పందించలేదని అన్నారు.ప్రేక్షకుల నుంచి అభిమానం పొందేందుకు చేయని సేవా కార్యక్రమాలను తామే చేస్తున్నట్లు ఎలా ప్రచారం చేసుకుంటారని నిలదీశారు.ఈ విషయంపై తాను ప్రచారం చేసిన టీవీ ఛానల్, సదరు కార్యక్రమానికి వ్యాఖ్యాతక వ్యవహరించిన యాంకర్ పై, యశశ్విపై త్వరలోనే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నట్లు చెప్పారు.







