ప్రతి ఏటా పెరుగుతున్న శివలింగం.. ఎక్కడో తెలుసా?

సాధారణంగా ఏ ఆలయంలోనైనా ఒక దేవతా విగ్రహాన్ని ప్రతిష్టించిన రూపంలోనే ఉంటూ భక్తులకు దర్శనం ఇస్తుంటారు.కానీ మీరు ఎప్పుడైనా ప్రతిష్టించబడిన దేవుడి విగ్రహం పెరగటం చూశారా? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం.

దేవునిపై భక్తి ఉన్నవారు ఇలా దేవుడు లింగం పెరగటానికి సాక్షాత్తు దేవుడి మహిమ అని భావిస్తారు.

అదే దేవుడిపై నమ్మకం లేనివారు ఇదొక వింతగానే చూస్తారు.మరి ప్రతి ఏటా పెరుగుతున్న శివ లింగం ఎక్కడ ఉంది? ఈ విధంగా శివ లింగం పెరగడానికి గల కారణం ఏమిటి? అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.ప్రతియేటా శివలింగం పెరుగుతూ భక్తులకు దర్శనమిస్తున్నటువంటి శివలింగం శ్రీకాకుళం జిల్లాలోని ఎండల మల్లికార్జున స్వామి దేవాలయంలో ఈ ఘటన చోటు చేసుకుంటుంది.

ప్రతి ఏడాది ఈ ఆలయంలో వెలసిన శివలింగం ఒక దాన్యం గింజ పరిమాణంలో పెరుగుతూ భక్తులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.పురాణాల ప్రకారం ఈ ఆలయంలో వెలసిన శివలింగాన్ని సాక్షాత్తు ఆ సీతారామచంద్రులు ప్రతిష్టించి పూజ చేశారని తెలుస్తోంది.

ఈ ఆలయంలో స్వామివారికి దేవత ఆలయం నిర్మించినప్పటికీ ఆలయం నిలవలేదు.ఇక్కడ వెలసిన స్వామి వారు ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ ఉండటంవల్ల ఈ ఆలయంలో వెలసిన స్వామివారిని ఎండల మల్లికార్జున స్వామిగా భక్తులు పూజిస్తున్నారు.

Shivalingam Growing Every Year Do U Know Where Is It, Shivalingam, Growing, Wors
Advertisement
Shivalingam Growing Every Year Do U Know Where Is It, Shivalingam, Growing, Wors

పూర్వం ఒడిస్సాకు చెందిన రాజులు కూడా ఈ స్వామివారికి ఆలయం నిర్మించాలని భావించారు.అయితే ఈ ఆలయంలో వెలసిన స్వామి వారు ప్రతిఏటా పెరుగుతుండటం వల్ల అది సాధ్యం కాకపోవడంతో ఆలయ నిర్మాణాన్ని విరమించుకున్నారు.ఈ ఆలయంలో వెలసిన స్వామివారిని సాక్షాత్తు సూర్య లింగంగా అభివర్ణిస్తారు.

ఈ ఆలయంలోని స్వామివారి లింగాన్ని తాకి వచ్చే గాలిని పీల్చడం వల్ల ఎలాంటి రోగాలు దరిచేరవని అక్కడ భక్తులు విశ్వసిస్తారు.ఇక సంతానం లేని దంపతులు ఈ ఆలయాన్ని దర్శించడం వల్ల సంతాన భాగ్యం కలుగుతుందని అలా ఆలయాన్ని దర్శించి సంతానం పొందిన వారు వారి బిడ్డలకు ఎక్కువగా శివయ్య, మల్లన్న, మల్లమ్మ వంటి శివుడి పేర్లనే పెట్టుకోవడం విశేషం.

ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ ఆలయానికి కేవలం ఆంధ్రప్రదేశ్ నుంచి మాత్రమే కాకుండా చుట్టుపక్కల నుంచి భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకుని స్వామివారి దర్శనం చేసుకోవడం విశేషం.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
Advertisement

తాజా వార్తలు