వెండితెరపై హీరోగా ఎన్నో అద్భుతమైనటువంటి సినిమాలలో నటించి నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి శివాజీ (Shivaji) ఇటీవల కాలంలో వెండితెరకు దూరమైన సంగతి మనకు తెలిసిందే.ఇలా వెండితెరకు దూరంగా ఉన్నటువంటి ఈయన ఒక్కసారిగా బిగ్ బాస్(Bigg Boss) కార్యక్రమంలో సందడి చేశారు.
ఇలా బిగ్ బాస్ కార్యక్రమంలో చివరి వరకు కొనసాగుతూ టాప్ త్రీ కంటెంట్ గా బయటకు వచ్చారు.ఇక ఈయన బిగ్ బాస్ నుంచి రాగానే తాను నటించిన వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్లలో భాగంగా ఇటీవల వరుస ఇంటర్వ్యూలకు శివాజీ హాజరవుతున్నారు.

ఇలా పలు ఇంటర్వ్యూలలో పాల్గొన్నటువంటి ఈయన బిగ్ బాస్ కార్యక్రమం గురించి ఎన్నో విషయాలను తెలియజేశారు.అదేవిధంగా ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఈయనకు ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ (Shivaji Re-entry) ఇవ్వడం గురించి కూడా ప్రశ్నలు ఎదురయ్యాయి.ఈ ప్రశ్నకు శివాజీ సమాధానం చెబుతూ తాను అవకాశాల కోసమే ఎదురుచూస్తున్నానని తనకు సరైన అవకాశం వస్తే తప్పకుండా ఇండస్ట్రీలోకి వస్తాను అంటూ శివాజీ వెల్లడించారు.

ఇక తాను హీరోగానే ప్రేక్షకుల ముందుకు రావాలి అని కోరుకోను.కథ ప్రాధాన్యత ఉన్నటువంటి విలన్ పాత్రలోనైనా( Villain Roles ) నటించడానికి నేను సిద్ధంగా ఉన్నానని ఈ సందర్భంగా శివాజీ తెలియజేశారు.అయితే ఎప్పుడు రోటీన్ పాత్రలే కాకుండా కాస్త డిఫరెంట్ గా ఉండే పాత్రలలో నటించాలని ఉంది అలాంటి పాత్రలలో నటించే అవకాశం వస్తే కనుక నేను అసలు వదులుకోను అంటూ ఈయన తన రీ ఎంట్రీ గురించి ఈ సందర్భంగా చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.మరి ఈయన ఎలాంటి పాత్రల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తారో తెలియాల్సి ఉంది.







