బాగా తగ్గిపోయిన శివాజీ క్రేజ్.. టైటిల్ రేస్ కి దూసుకొస్తున్న ప్రియాంక..?

ఈ సీజన్ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ లో కండబలం కంటే ఎక్కువగా బుద్ధి బలం ఉపయోగిస్తూ మొదటి రోజు నుండి ఇప్పటి వరకు అశేష ప్రేక్షకాభిమానం తో కొనసాగుతున్న కంటెస్టెంట్స్ లో ఒకరు శివాజీ.( Shivaji ) తన మాటలతో హోస్ట్ అక్కినేని నాగార్జున ని( Akkineni Nagarjuna ) సైతం ఏమార్చగల సత్తా ఉన్న కంటెస్టెంట్ ఆయన.

అందుకే చెయ్యి విరిగి ఎన్నో టాస్కులకు దూరం అయినా ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాడు.నిన్న మొన్నటి వరకు టైటిల్ రేస్ లో ముందంజలో ఉన్న శివాజీ, ఇప్పుడు మెల్లగా ఆయన గ్రాఫ్ ని బాగా తగ్గించేసుకుంటున్నాడు అని అందరూ అనుకుంటున్నారు.

విశ్లేషకులు సైతం శివాజీ క్రేజ్ ఇంతకు ముందు ఉన్న రేంజ్ లో లేదని అంటున్నారు.అందుకు కారణం కూడా లేకపోలేదు.ఎప్పుడైతే కెప్టెన్సీ టాస్కు విషయం లో అమర్ దీప్ ని( Amardeep ) కెప్టెన్ కాకుండా చేసాడో, అప్పటి నుండి ఆయన గ్రాఫ్ బాగా తగ్గిపోయింది.

Shivaji Craze Reduced A Lot Priyanka In Bigg Boss Title Race Details, Shivaji ,

ఈ విషయం లో శివాజీ తో పాటుగా ఇన్వాల్వ్ అయినా అర్జున్ గ్రాఫ్ కూడా బాగా దెబ్బ తినింది.ఏ రేంజ్ లో అంటే ఈవారం డేంజర్ జోన్ లోకి వచ్చేంత.ఇక శివాజీ అయితే టాప్ 3 రేస్ నుండి కూడా తొలగిపోయే ప్రమాదం ఉందని, ఎందుకంటే ఈ వారం ప్రియాంక( Priyanka ) గ్రాఫ్ ఆ రేంజ్ లో లేచిందని అంటున్నారు విశ్లేషకులు.

టికెట్ టు ఫినాలే టాస్కులో బ్యాడ్ లక్ కారణంగా ఎలిమినేట్ అయిపోయింది కానీ, ఆమె అదే విధంగా కొనసాగి ఉండుంటే మాత్రం కచ్చితంగా ఆమె శివాజీ ని క్రాస్ చేసి ఉండేదని అంటున్నారు.ఒక్కటైతే నిజం, అసలు టాప్ 5 లో ఉంటుందా లేదా అనే విధంగా ఉన్న ప్రియాంక, ఈ వారం తో టాప్ 5 లో బెర్త్ ఖరారు చేసుకుంది.

Advertisement
Shivaji Craze Reduced A Lot Priyanka In Bigg Boss Title Race Details, Shivaji ,

రాబొయ్యే రోజుల్లో ఇంకా సమీకరణాలు మారొచ్చు.

Shivaji Craze Reduced A Lot Priyanka In Bigg Boss Title Race Details, Shivaji ,

ఇది ఇలా ఉండగా టికెట్ టు ఫినాలే రేస్ లో దాదాపుగా అందరూ కంటెస్టెంట్స్ తొలగిపోగా, చివరికి అమర్ దీప్ మరియు పల్లవి ప్రశాంత్( Pallavi Prashanth ) మిగిలారు.ఈ ఇద్దరి మధ్య పోరు వేరే లెవెల్ లో ఉండబోతుంది.అమర్ దీప్ కి గెలిచినా ఓడినా అతనికి పాజిటివ్ అవుతుంది.

ఎందుకంటే ఒక్క శోభా శెట్టి మినహా, ఎవ్వరూ కూడా అమర్ దీప్ పట్ల బలమైన స్టాండ్ తీసుకోలేదు.శివాజీ కి బలవంతంగా ఇవ్వాల్సి వచ్చింది కానీ, ఆయనకీ కూడా ఇవ్వాలని లేదు.

ఇంకా బెస్ట్ ఫ్రెండ్ అనుకున్న ప్రియాంక ని గుడ్డిగా నమ్మితే ఆమె గౌతమ్, అర్జున్ కి సపోర్టు గా నిలిచి అమర్ దీప్ కి, ఆడియన్స్ కి ఫ్యూజులు ఎగిరిపోయే రేంజ్ ట్విస్ట్ ఇచ్చింది.అలాగే గౌతమ్ కోసం అర్జున్, అర్జున్ కోసం గౌతమ్, ప్రశాంత్ కోసం యావర్ ఇలా అందరూ స్టాండ్ తీసుకోగా, ఏకాకిగా మిగిలింది చివరికి అమర్ దీప్ మాత్రమే.

పైసా ఖర్చు లేకుండా ఈ మ్యాజికల్ హోమ్ మేడ్ సీరం తో తెల్లగా మెరిసిపోండి!

కాబట్టి ఈ ఫినాలే టాస్క్ ఓడిపోతే మాత్రం అమర్ దీప్ కి టైటిల్ ఫిక్స్ అయిపోతున్నట్టే అనుకోవచ్చు.ఆ రేంజ్ లో ఆయనపై సానుభూతి ఏర్పడుతుంది.

Advertisement

తాజా వార్తలు