ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న విజయ్ దేవరకొండ, సమంత ఫుల్ లెంగ్త్ ఎంటర్ టైనర్ "ఖుషి"

సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఫుల్ లెంగ్త్ ఎంటర్ టైనర్ సినిమా “ఖుషి” ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది.ఈ చిత్రంలో సమంత హీరోయిన్ గా నటిస్తోంది.

 Shiva Nirvana, Mtrhri Movie Makers' Kushi Wraps Kashmir Schedule , Vijay Devera-TeluguStop.com

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శివ నిర్వాణ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

వై రవిశంకర్, నవీన్ యేర్నేని నిర్మాతలు.గత నెల 23 తేదీ నుంచి కశ్మీర్ లో రెగ్యులర్ చిత్రీకరణ మొదలు పెట్టారు.

అక్కడి అందమైన లొకేషన్స్ లో కీలక సన్నివేశాలను షూట్ చేశారు.ఫస్ట్ షెడ్యూల్ పూర్తయిన సందర్భంగా చిత్ర బృందం గ్రూప్ ఫొటో దిగారు.

కశ్మీర్ షెడ్యూల్ అమోజింగ్ ఫీల్ ఇచ్చింది, విజయ్, సమంతతో పాటు యూనిట్ అందరికీ కంగ్రాంట్స్ అంటూ దర్శకుడు శివ నిర్వాణ ట్వీట్ ద్వారా సంతోషాన్ని పంచుకున్నారు.

నెక్స్ట్ త్వరలోనే హైదరాబాద్ మొదలవుతుంది.

ఆ తర్వాత వైజాగ్, అల్లెప్పిలలో మిగతా షూటింగ్ చేయనున్నారు.ఇటీవలే విడుదల చేసిన “ఖుషి” టైటిల్,ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ కు అద్భుతమైన స్పందన వచ్చింది.

పక్కా ప్లానింగ్తో షూటింగ్ కంప్లీట్ చేసి డిసెంబర్ 23న తెలుగుతో పాటు తమిళం, మలయాళం,కన్నడ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయాలని చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube