డిటెక్టివ్ థ్రిల్లర్స్ సినిమాలకు ఎంతో మంచి డిమాండ్ ఉంటుంది.ఇలాంటి సినిమాలను ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్నాయి.
ఇలా చిన్న సినిమాలైనా కంటెంట్ ఉంటే ఎంతో మంచి సక్సెస్ అందుకు ఉంటాయని ఇదివరకు ఎన్నో సినిమాలు నిరూపించాయి అయితే తాజాగా ఇలాంటి డిటెక్టివ్ థ్రిల్లర్ జానర్ లోనే ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి తాజా చిత్రం భూతద్దం భాస్కర్ నారాయణ.( Bhoothaddam Bhaskar Narayana ) మరి ఈ సినిమా కథ ఏంటి? ఈ సినిమా ప్రేక్షకులను ఎలా మెప్పించింది అని విషయానికి వస్తే.
కథ:
తెలుగు, కన్నడ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో జరుగుతుంది.ఎవరో ఒక సైకో కిల్లర్ వరుస హత్యలు చేస్తూ వస్తుంటాడు.మహిళల తల నరికి, ఆ తల స్థానంలో ఓ దిష్టిబొమ్మని పెడుతుంటాడు.ఇలా వరుసగా హత్యలు జరుగుతూ ఉంటే ఈ హత్యలు వెనుక ఉన్నది ఎవరో తెలుసుకోవడానికి డిటెక్టివ్ భాస్కర్ నారాయణ (శివ కందుకూరి)( Shiva Kandukuri ) రంగంలోకి దిగుతారు.
ఇలా ఈ హత్యల వెనుక ఉన్న కారణాలను తెలుసుకొని నేపథ్యంలో పురాణాలకు ఉన్న కనెక్షన్ తెలుసుకుంటాడు.ఇక ఆ హత్యలు ఎవరు చేస్తున్నారు.? తల నరికేసి దిష్టిబొమ్మని ఎందుకు పెడుతున్నాడు.? అనే విషయాలను థియేటర్ లోనే చూడాల్సి ఉంటుంది.
నటీనటుల నటన:
భాస్కర్ నారాయణ పాత్రలో శివ కందుకూరి జీవించేసాడు అనే చెప్పాలి.ఈస్ అఫ్ యాక్టింగ్ తో డిటెక్టివ్ గా ( Detective ) ఆడియన్స్ ని మెప్పిస్తాడు.అన్ని సినిమాల్లో చూపించినట్లు కాకుండా సరికొత్తగా ఆ ప్రాంతానికి అనుగుణంగా నేచురల్ లుక్ లో చూపించారు.ఇలా ఈ సినిమాలో మిగిలిన తారాగణం కూడా వారి పాత్రలకు 100% న్యాయం చేశారు.
టెక్నికల్:
శ్రీచరణ్ పాకాల( Sricharan Pakala ) సంగీతం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.టాలీవుడ్ లోని పలు థ్రిల్లర్ సినిమాలకు శ్రీచరణ్ స్కోర్ ఎలా అసెట్ అయ్యిందో.ఈ చిత్రానికి కూడా అంతే పెద్ద అసెట్ గా నిలిచింది.సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది.థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారికి ఈ సినిమా ఎంతో అద్భుతంగా నచ్చుతుంది.
విశ్లేషణ:
డిటెక్టివ్ థ్రిల్లర్స్( Detective Thrillers ) అంటే ఆడియన్స్ లో కొన్ని అంచనాలు ఉంటాయి.ఆ అంచనాలను అందుకోవడంలో భూతద్ధం భాస్కర్ నారాయణ ఎంతో మంచి సక్సెస్ అయిందని చెప్పాలి.పురాణా కథకి క్రైమ్ థ్రిల్లర్‌కి కనెక్షన్ పెట్టడం.
ఆడియన్స్ కి కొత్త ఫీలింగ్ ని కలిగిస్తుంది.చివరి వరకు ఇదే సస్పెన్స్ క్రియేట్ చేస్తూ వచ్చారు.సెకండ్ హాఫ్ లో వచ్చినటువంటి ట్విస్ట్ అద్భుతంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ప్లస్ పాయింట్స్:
నటీనటుల నటన, కథ, మ్యూజిక్, సస్పెన్స్ సన్నివేశాలు.
మైనస్ పాయింట్స్:
అక్కడక్కడ రొటీన్ సన్నివేశాలు