దక్షిణ భారతదేశంలో శివ భక్తులు.. కచ్చితంగా చూడవలసిన శివాలయాలు ఇవే..

భారతదేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అని ప్రపంచ దేశాల ప్రజలు చెబుతూ ఉంటారు.

విశిష్ట కళలు, విభిన్న సంస్కృతులు ఎక్కడ లేనన్ని సనాతన ఆచార సంప్రదాయాలు మన దేశంలో ఉన్నాయి.

ముఖ్యంగా పూర్వకాలం నుంచి నేటి ఆధునిక యుగం వరకు మన దేశంలో ఎన్నో అద్భుతమైన కట్టడాలు, దేవాలయాలకు మన దేశం పుట్టినిల్లు.దేవాలయాల విషయానికొస్తే మనకు ప్రముఖంగా వినిపించే పేరు మహా శివుడు.

అందుకే ఏ రాష్ట్రంలో అయినా శివాలయాలు కచ్చితంగా మనకు కనిపిస్తాయి.బోలేనాథుడు, కైలాసనాథుడు, కేథరేశ్వరుడు, సోమనాథుడు, బైద్యనాథ, బద్రినాథ, రామనాథ, అమర్ నాథ స్వామితో పాటు ఇంకా అనేక పేర్లు శివయ్యకు ఉన్నాయి.

సాధారణంగా మహాశివరాత్రి పండుగ సమయంలో ప్రముఖ పుణ్య క్షేత్రాలన్నీ భక్తులతో రద్దీగా ఉన్నాయి.ఒక్కొక్క క్షేత్రానికి ఒక్కో విశిష్టత చరిత్రకా నేపథ్య ప్రాముఖ్యత ఉంది.

Advertisement
Shiva Devotees In South India These Are The Shiva Temples That Must Be Seen ,Sou

ఈ నేపథ్యంలో మన దక్షిణ భారతదేశంలోని ప్రముఖ శివాలయాల గురించి తెలుసుకుందాం.

Shiva Devotees In South India These Are The Shiva Temples That Must Be Seen ,sou

శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయం ఆంధ్రప్రదేశ్ లోని శ్రీశైలంలో ఉంది.దీనిని సాధారణంగా శ్రీశైలం శివాలయం అని పిలుస్తారు.ఈ ఆలయంలో ఉచిత దర్శన వేళలు ఉదయం 4:30 నుంచి 10 గంటల వరకు ఉంటుంది.కావేరి నదికి దక్షిణ ఒడ్డున ఉన్న శైవ హిందూ దేవాలయం బృహదీశ్వరాలయం.

ఇది తమిళనాడులోని తంజావూరులో ఉంది.దీనిని సాధారణంగా తంజై కోవిల్, పెరువుడైయార్ కోవిల్ అని పిలుస్తారు.

Shiva Devotees In South India These Are The Shiva Temples That Must Be Seen ,sou

ఈ ఆలయం చోళ వాస్తు శిల్పకళా ఆధారంగా నిర్మించబడింది.దక్షిణ భారత దేశంలోనే ఎత్తైన పిరమిడ్ ఆకారపు శివాలయం ఇదే.మురుడేశ్వర్ దేవాలయం ప్రపంచంలోనే రెండో ఎత్తైన శివ విగ్రహంగా ప్రసిద్ధి చెందింది.మురుడేశ్వర అనేది కోస్టల్ కర్ణాటకలోని ఉత్తర కెనరా జిల్లా భట్కల తాలూకాలోని ఒక దేవాలయం.

పరమశివుని ప్రత్యేక ఆశీస్సులు ఉన్న రాశులు ఇవే..

ఇది మంగళూరు పట్టణంలోని కార్వారఱ్ హైవే పై ఉంటుంది.దక్షిణ భారతదేశంలో పురాతన దేవాలయంలో ఈ వడక్కునాథన్ దేవాలయం కూడా ఒకటి.

Advertisement

ఇది కేరళలోని త్రిస్సూర్ నగరంలో ఉంది.దేవాలయానికి నాలుగు వైపులా ఒక స్మారక గోపురం కూడా ఉంటుంది.

తాజా వార్తలు