కొంటె గొర్రె.. ముందు కాళ్లను వెనక్కి లేపి రెండు కాళ్లతో నడుస్తోంది

ప్రస్తుతం సోషల్ మీడియా విస్తృత ప్రాచుర్యంలోకి వచ్చాక ఎన్నో వైరల్ వీడియోలను మనం చూస్తున్నాం.అందులో కొన్ని నవ్విస్తాయి.

 Sheep Walking On Two Legs With Front Legs Raised Back Sheep, Viral Latest, News-TeluguStop.com

మరికొన్ని కవ్విస్తాయి.ముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియోలు ముచ్చట గొలుపుతుంటాయి.

కొన్ని సార్లు జంతువులు ప్రవర్తించే తీరు చాలా ఆసక్తిదాయకంగా ఉంటుంది.ఇలాంటి జంతువుల వీడియోలు సోషల్ మీడియాలో చాలా హల్ చల్ చేస్తుంటాయి.

వాటిని చూసేందుకు నెటిజన్లు ఆసక్తి చూపుతుంటారు.తాజాగా అలాంటి ఓ ఆసక్తికరమైన వీడియో బాగా వైరల్ అవుతోంది.

అందులో ఓ గొర్రె తమ సహజరీతికి భిన్నంగా రెండు కాళ్లపై నడిచింది.కాకతాళీయంగా కాకుండా పదే పదే అలా నడుస్తూ, మనిషిలా నడిచేందుకు అనుకరించింది.

దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.

సోషల్ మీడియాలో ఏ వీడియో ఎప్పుడు వైరల్ అవుతుందో చెప్పలేం.

ఏ మాత్రం ఆసక్తిగొలిపే వీడియో అయినా, రాత్రికి రాత్రే ట్రెండ్‌గా మారిపోతుంది.తాజాగా అలాంటి ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

సాధారణంగా గొర్రెలు నాలుగు కాళ్ల మీద నడుస్తుంటాయి.రెండు కాళ్లపై నడవాలని ప్రయత్నించినా, వాటికి సాధ్యం కాదు.

అయితే ఓ వైరల్ వీడియోలో మాత్రం ఓ గొర్రె రెండు కాళ్లపై నడిచింది.దానిని ఓ పశువుల కొట్టాంలో పెట్టగా, అది ఇలా మనిషిలా ప్రవర్తించింది.

రెండు వెనుక కాళ్లపై ఆధారపడి నిలబడింది.అలా కాసేపు ముందుకు నడిచింది.

అలా రెండుకాళ్లపై నడవడానికి చాలా ట్రై చేసింది.సాధారణంగా గొర్రెలు తల కిందకి దించుకుని వెళ్లిపోతుంటాయి.

ఈ గొర్రె మాత్రం అలా కాకుండా విభిన్నంగా ప్రయత్నించింది.ఇది భలే కొంటె గొర్రె అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

మరికొందరు ఇది రాత్రి మందు వేసి ఉంటుందని కామెంట్ చేశారు.మొత్తం 11 సెకన్ల వ్యవధి ఉండే ఈ వీడియో లక్షకు పైగా వ్యూస్‌తో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube