తెలంగాణ ప్రభుత్వ తీరుపై షర్మిల విమర్శనాస్త్రాలు

తెలంగాణ ప్రభుత్వ తీరుపై వైఎస్ఆర్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.చంచల్ గూడ జైలు నుంచి విడుదలైన షర్మిల మాట్లాడుతూ ప్రజల కోసం పోరాటం చేస్తున్న తనపై కేసులు పెడుతున్నారని మండిపడ్డారు.

 Sharmila's Criticism Of Telangana Government-TeluguStop.com

ప్రజా సమస్యలపై పోరాటం చేస్తుంటే అడ్డుకుంటున్నారని షర్మిల ఆరోపించారు.తనను చూసి కేసీఆర్ భయపడుతున్నారని చెప్పారు.

పోలీసులను వాడుకుని తమను అడ్డుకుంటున్నారని తెలిపారు.తాను ఎవరిపై దాడి చేయలేదని, మహిళా పోలీసులే తనపై దాడి చేశారని షర్మిల తెలిపారు.

తనను పరామర్శించేందుకు వచ్చిన తన తల్లిపై కూడా దౌర్జన్యం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.తిరిగి పోలీసులపై విజయమ్మ దాడి చేశారని అసత్య ప్రచారం చేశారని మండిపడ్డారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube