Bhumi Shetty : నిన్నెవరు పెళ్లి చేసుకుంటారు అన్నారు.. అలాంటి కామెంట్లు చేశారు.. భూమి శెట్టి షాకింగ్ కామెంట్స్ వైరల్!

భూమి శెట్టి( Bhumi Shetty ) ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కువగా ఈ పేరు కూడా ఒకటి.శరతులు వర్తిస్తాయి ( sharatulu vartistai )అనే సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది భూమి శెట్టి.

 Sharatulu Vartistai Actress Bhoomi Shetty About Her Life Struggles-TeluguStop.com

తాజాగా ఈ మూవీ మార్చి 15 న విడుదలైన విషయం తెలిసిందే.ఈ సినిమా విడుదల అయ్యి మంచి సక్సెస్ ను సాధించింది.

ఈ సందర్భంగా హీరోయిన్ భూమి శెట్టి పలు ఇంటర్వ్యూలకు హాజరవుతూ సినిమాలకు వ్యక్తిగత విషయాలకు సంబంధించిన ఎన్నో విషయాలను పంచుకుంటుంది.ఈ మేరకు తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ఈ మేరకు మాట్లాడుతూ.

Telugu Bhoomi Shetty, Struggules-Movie

మాది కర్ణాటక ( Karnataka )ప్రాంతం.మా ఇంట్లో ఇంజనీరింగ్‌ చేస్తానంటే ఒప్పుకోలేదు.నీకు ఇంజనీరింగ్‌ ఎందుకు? పెళ్లి చేసేస్తాం అన్నారు.లేదు, చదువు కొనసాగిస్తానంటే నాతో మాట్లాడటం మానేస్తామని బెదిరించారు.

అయినా సరే ఇంజనీరింగ్‌ చేస్తానని ఇంట్లో నుంచి బయటకు వచ్చాను.ఆరేళ్ల పాటు ఇంట్లోవాళ్లు నాతో మాట్లాడలేదు.

ఓసారి నాకు సీరియల్‌లో నటించే అవకాశం వచ్చింది.ఈ విషయం నేను వాట్సాప్‌ గ్రూపులో పంపిస్తే ఎవరూ పట్టించుకోలేదు.

తర్వాత నేను కన్నడ బిగ్‌బాస్‌కు వెళ్లాను.నన్నెలాగో మార్చలేమని అర్థమయ్యాక చివరికి నాతో మాట్లాడటం మొదలు పెట్టారు.

Telugu Bhoomi Shetty, Struggules-Movie

బాల్యంలో నా కలర్‌ గురించి చాలా మాటలన్నారు.బ్లాకీ అని, నల్లగా ఉన్నానని కామెంట్లు చేశారు.ఏదైనా ఫంక్షన్‌కు వెళ్లాలన్నా భయమేసేది.నువ్వు ఇంత నల్లగా ఉన్నావ్‌.పెద్దయ్యాక నిన్నెవరు పెళ్లి చేసుకుంటారు? ముఖానికి క్రీముల్లాంటివి పూసుకోమని, తెల్లగా కనిపించాలని చెప్పేవారు.నేను యక్షగానం చేసే ఆర్టిస్టును.

యక్షగానం చేసేటప్పుడు నాలుగు లేయర్ల మేకప్‌ వేస్తారు.పది లేయర్ల డ్రెస్సు వేసుకుంటాం.

అంత కష్టపడితే మా ప్రతిభను గుర్తించి పొగిడేవారు కాదు.పైగా ముఖానికి అలా రంగు పూసుకోవడం వల్ల ఇంకా నల్లగా అవుతున్నానని ఎగతాళి చేసేవారు.

అలా ఎన్నో మాటలు పడ్డాను.వాటన్నింటికీ అధిగమించాను అని చెప్పుకొచ్చింది భూమి శెట్టి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube