యూట్యూబ్ లో ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సెలబ్రిటీలలో షణ్ముఖ్ జశ్వంత్ ఒకరు.షణ్ముఖ్ జశ్వంత్ నటించిన వీడియో యూట్యూబ్ లో విడుదలైతే కొన్ని గంటల్లోనే యూట్యూబ్ లో మిలియన్ల వ్యూస్ ను సొంతం చేసుకుంటూ ఉండటం గమనార్హం షణ్ముఖ్ జశ్వంత్ బిగ్ బాస్ షో విన్నర్ గా నిలుస్తారని అభిమానులు భావించినా కొన్ని కారణాల వల్ల షణ్ముఖ్ విన్నర్ కాలేదు.
అయితే ఈ షో ద్వారా షణ్ముఖ్ కు కళ్లు చెదిరే స్థాయిలో రెమ్యునరేషన్ వచ్చింది.
బిగ్ బాస్ విన్నర్ గెలిచిన మొత్తం కంటే ఎక్కువ మొత్తాన్ని షణ్ముఖ్ జశ్వంత్ కంటెస్టెంట్ గా గెలుచుకున్నారని కామెంట్లు వినిపించాయి.
మరోవైపు వెబ్ సిరీస్ ల ద్వారా షణ్ముఖ్ జశ్వంత్ ఎక్కువ మొత్తం సంపాదించారు.షణ్ముఖ్ జశ్వంత్ కు సినిమా ఆఫర్లు కూడా వస్తుండగా త్వరలో సినిమాలు లేదా వెబ్ సిరీస్ లలో ఎందులో కొనసాగాలనే విషయంలో షణ్ముఖ్ జశ్వంత్ కీలక నిర్ణయం తీసుకోనున్నారు.
మరోవైపు షణ్ముఖ్ జశ్వంత్ తాజాగా కొత్త ఇంట్లోకి అడుగుపెట్టారు. బిగ్ బాస్ షో ద్వారా సంపాదించిన డబ్బుతో పాటు తన సేవింగ్స్ తో షణ్ముఖ్ ఈ ఇంటిని కొనుగోలు చేశారు.
షణ్ముఖ్ కొత్త ఇంటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఈ ఇంటి ఖరీదు రెండు కోట్ల రూపాయలకు అటూఇటుగా ఉండవచ్చని తెలుస్తోంది.
షణ్ముఖ్ అభిమానులు అతనికి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

షణ్ముఖ్ గృహ ప్రవేశ వేడుకకు నటి, యూట్యూబర్ శ్రీవిద్య, మరి కొందరు యూట్యూబర్లు హాజరయ్యారు.మరోవైపు షణ్ముఖ్ దీప్తి సునైనా కొన్నిరోజుల క్రితం విడిపోయిన సంగతి తెలిసిందే.వీళ్లిద్దరూ మళ్లీ కలవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
షణ్ముఖ్ దీప్తి సునైనా కలుస్తారో లేదో చూడాల్సి ఉంది.







