దుమ్ము లేపుతున్న ‘శంకర్ దాదా MBBS ‘ రీ రిలీజ్ అడ్వాన్స్ బుకింగ్స్..నిమిషాల్లో అమ్ముడుపోతున్న టికెట్స్!

నాలుగు దశాబ్దాల సుదీర్ఘ మెగాస్టార్ చిరంజీవి ( Megastar Chiranjeevi )కెరీర్ లో మనకి ఇష్టమైన ఎదో ఒక్క సూపర్ హిట్ సినిమా ఏమిటి అని అడిగితే టక్కుమని చెప్పలేము.

ఎందుకంటే ఆయన టాలీవుడ్ కి ఎన్నో బ్లాక్ బూస్టర్లు, ఇండస్ట్రీ హిట్లు మరియు కల్ట్ క్లాసిక్ సినిమాలను అందించాడు.

ఎదో ఒక్క సినిమా గురించి చెప్పమంటే చాలా కష్టం.కానీ నేటి తరం యూత్ ఆడియన్స్ కి బాగా నచ్చిన మెగాస్టార్ సినిమా ఏమిటి అని అడిగితే ఎక్కువ శాతం మంది శంకర్ దాదా ఎంబీబీఎస్( Shankar Dada MBBS ) అని చెప్తారు.

ఇంద్ర,ఠాగూర్ వంటి సంచలనాత్మక సీరియస్ సబ్జక్ట్స్ తర్వాత మెగాస్టార్ చేసిన ఎంటర్టైన్మెంట్ మూవీ ఇది.హిందీ లో సంజయ్ దత్ హీరో గా నటించిన మున్నా భాయ్ ఎంబీబీఎస్( Munna Bhai MBBS ) చిత్రానికి ఇది రీమేక్.ఒరిజినల్ వెర్షన్ కంటే ఈ రీమేక్ వెర్షన్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

మెగాస్టార్ కామెడీ టైమింగ్ కి ఆడియన్స్ మొత్తం ఫిదా అయిపోయారు.

Shankar Dada Mbbs Re Release Advance Bookings That Are Raising Dust Tickets Are
Advertisement
Shankar Dada Mbbs Re Release Advance Bookings That Are Raising Dust Tickets Are

ఈ సినిమా ఆరోజుల్లో ఇంద్ర,ఠాగూర్ ( Indra, Tagore )రికార్డ్స్ ని బద్దలు కొట్టి ఇండస్ట్రీ హిట్ మాత్రం అవ్వలేదు కానీ, అప్పట్లో ఆల్ టైం టాప్ 2 చిత్రం గా నిల్చింది.నైజాం మరియు ఓవర్సీస్ ప్రాంతాలలో ఈ సినిమా సృష్టించిన సెన్సేషన్ మామూలుది కాదు.అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా అన్నీ ప్రాంతాలకు కలిపి 26 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను సాధించింది.

అలాగే నైజాం ప్రాంతం లో ఈ చిత్రానికి దాదాపుగా 9 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.అప్పట్లో ఈ ప్రాంతం లో ఇది ఆల్ టైం రికార్డు అనే చెప్పాలి.

అలా మెగాస్టార్ కెరీర్ లో ఆల్ టైం క్లాసిక్ చిత్రాలలో ఒకటిగా నిల్చిన ఈ సినిమాని ఇప్పుడు లేటెస్ట్ 4K కి మార్చి గ్రాండ్ గా నవంబర్ 4 వ తేదీన విడుదల చెయ్యబోతున్నారు.దీనికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ పలు ప్రాంతాలలో మొదలయ్యాయి.

Shankar Dada Mbbs Re Release Advance Bookings That Are Raising Dust Tickets Are

ముఖ్యంగా హైదరాబాద్ లో ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ టికెట్స్ హాట్ కేక్స్ లాగ అమ్ముడుపోతున్నాయి.బుక్ మై షో లెక్కల ప్రకారం ఈ సినిమాకి కేవలం ఒక్క గంటలో 5 వేల టికెట్స్ కి పైగా సేల్ అయ్యాయి.అది కూడా కేవలం 5 షోస్ మీద మాత్రమే, ఇక రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయి అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం అయితే ఇక ఏ రేంజ్ లో ఉంటాయో అని ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్.

న్యూస్ రౌండప్ టాప్ 20

ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం ఈ చిత్రానికి మొదటి రోజే రెండు కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టే అవకాశం ఉందని అంటున్నారు ట్రేడ్ పండితులు , చూద్దలి మరి.

Advertisement

తాజా వార్తలు