బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ( Shahrukh Khan ) నటించిన లేటెస్ట్ మోస్ట్ ఏవైటెడ్ మూవీ ”జవాన్’‘( Jawan ).ఈ సినిమాపై బాలీవుడ్ లో ఎంత బజ్ క్రియేట్ అయ్యిందో సౌత్ లో కూడా అదే రేంజ్ లో బజ్ క్రియేట్ అయ్యింది.
ఎందుకంటే ఈ సినిమా పేరుకు మాత్రమే బాలీవుడ్.ఈ సినిమాలో పని చేసిన వారంతా సౌత్ కు చెందిన వారు కావడం విశేషం.
డైరెక్టర్ నుండి హీరోయిన్ వరకు ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ సౌత్ వారే ఎక్కువ.

అందుకే కోలీవుడ్ లో భారీ క్రేజ్ ఏర్పడగా తెలుగులో కూడా మంచి బజ్ నెలకొంది.షారుఖ్ ఖాన్ హీరోగా నయనతార ( Nayanthara )హీరోయిన్ గా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ మూవీ ‘‘జవాన్” సినిమా మరో రెండు రోజుల్లో రిలీజ్ కాబోతుంది.ఈ సినిమా సెప్టెంబర్ 7న రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో టీమ్ అంతా ప్రమోషన్స్ పై ద్రుష్టి పెట్టారు.

ఈ క్రమంలోనే టీమ్ అంతా ఈ రోజు తిరుమల శ్రీవారి సన్నిధిలో కనిపించారు.అట్లీ, నయనతార ఆమె భర్త విఘ్నేష్ తో పాటు షారుఖ్ ఖాన్ తన ఫ్యామిలీతో అక్కడ కనిపించారు.షారుఖ్ ఖాన్, ఆయన కూతురు సారా అలీ ఖాన్ తిరుమల శ్రీవారిని భక్తి శ్రద్ధలతో పూజలు చేసారు.ఇక బయటకు వచ్చిన తర్వాత షారుఖ్ ఖాన్ ధ్వజస్థంభానికి తల ఆనించి ప్రార్ధనలు చేయడం ఫ్యాన్స్ ను ఆశ్చర్య పరుస్తుంది.
వీరు తిరుమలలో సందడి చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.ఇదిలా ఉండగా ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్( Anirudh Ravichander ) సంగీతం అందిస్తున్నాడు.
విజయ్ సేతుపతి, ప్రియమణి, సునీల్ గ్రోవర్, సన్యా మల్హోత్రా వంటి వారు కీ రోల్స్ పోషిస్తున్నారు.ఇక ఈ సినిమాను రెడ్ చిల్లీస్ ఎంటెర్టైనమెంట్స్ పతాకంపై గౌరీ ఖాన్ నిర్మిస్తుండగా పాన్ ఇండియా వ్యాప్తంగా రిలీజ్ కానుంది.
మరి ఈ సినిమా షారుఖ్ కు ఎలాంటి హిట్ అందిస్తుందో వేచి చూడాలి.







