భారీ ధరకు ''జవాన్'' తమిళ్ హక్కులు.. అక్కడ కూడా గ్రాండ్ రిలీజ్!

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ఇటీవలే ‘పఠాన్'( Pathaan ) సినిమాతో ఒక దశాబ్దం తర్వాత హిట్ అందుకున్నాడు.ఈ సినిమాతో ఈయన హిట్ అందుకోవడమే కాకుండా మొత్తం బాలీవుడ్ ఇండస్ట్రీకే భారీ హిట్ అందించి తన కలెక్షన్స్ తో హిందీ బెల్ట్ కు ఊపిరి పోసాడు.

 Shahrukh Khan And Atlee Jawan Tamil Rights Sold, Jawan Movie, Shahrukh Khan, Atl-TeluguStop.com

ఈ హిట్ తో మళ్ళీ ఫుల్ ఫామ్ లోకి వచ్చిన షారుఖ్ ఖాన్ ప్రజెంట్ ఫుల్ జోష్ తో ”జవాన్” సినిమాను స్టార్ట్ చేస్తున్నాడు.

అయితే ఈసారి షారుఖ్ ఖాన్( Shahrukh Khan ) సౌత్ డైరెక్టర్ తో వర్క్ చేస్తున్నాడు.షారుఖ్ ఖాన్ హీరోగా నయనతార హీరోయిన్ గా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ( Kolywood Director Atlee ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ మూవీ ”జవాన్”.ఈ సినిమా హిందీలో మాత్రమే కాదు పాన్ ఇండియా వ్యాప్తంగా రిలీజ్ అవ్వనుంది.

మరి తాజాగా తమిళ్ హక్కుల గురించి లేటెస్ట్ న్యూస్ వైరల్ అయ్యింది.
షారుఖ్ ఖాన్ జవాన్ సినిమా( Jawan )తో ఎలా అయినా మరో బిగ్గెస్ట్ హిట్ అందుకోవాలని ఈగర్ గా ఎదురు చూస్తున్నాడు.

ఈ సినిమా హిందీ, తమిళ్, తెలుగు భాషల్లో వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుండగా తాజాగా జవాన్ తమిళ్ రిలీజ్ పై అప్డేట్ వచ్చింది.కోలీవుడ్ లోనే బిగ్గెస్ట్ డిస్టిబ్యూషన్ సంస్థ రెడ్ జెయింట్( Red Giant ) వారు గోకులం ఫిలిమ్స్ తో కలిసి భారీ ధరకు కొనుగోలు చేసినట్టు టాక్.

దీంతో తమిళ్ అంతటా తమిళ్ వర్షన్( Jawan Tamil Version ) తో పాటు హిందీ వర్షన్ రిలీజ్ కూడా చేయనున్నట్టు తెలుస్తుంది.ఇదే నిజమైతే షారుఖ్ జవాన్ కు తమిళ్ ఇండస్ట్రీలో భారీ రిలీజ్ దక్కుతుంది అనే చెప్పాలి.అలాగే అంతే స్థాయిలో ఓపెనింగ్స్ ను కూడా కొల్లగొట్టే అవకాశం ఉంది.అంతా తమిళ్ తంబీలే ఈ సినిమా కోసం ఎక్కువుగా పని చేయడం కూడా ఈ సినిమాకు అక్కడ ప్లస్ అవుతుంది అనే చెప్పాలి.

ఇక ఈ సినిమా సెప్టెంబర్ 7న రిలీజ్ కాబోతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube