'జవాన్' ఫస్ట్ డే ఓపెనింగ్స్.. ఊహించని విధంగా వసూళ్లు!

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ సౌత్ డైరెక్టర్ అట్లీ( Director Atlee ) కాంబోలో సినిమా ప్రకటించగానే అటు బాలీవుడ్ ఇటు కోలీవుడ్ ఇండస్ట్రీలో అంచనాలు ఒక్కసారిగా పెరిగాయి.అందులోను షారుఖ్ పఠాన్ వంటి బ్లాక్ బస్టర్ తో కొన్నేళ్ల తర్వాత ఫామ్ లోకి వచ్చాడు.

 Shah Rukh Khan Jawan Box Office Collection Day 1, Jawan Movie, Shahrukh Khan, At-TeluguStop.com

ఇదే ఊపులో వెంటనే సౌత్ డైరెక్టర్ తో సినిమా ప్రకటించడంతో ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ అయినా ఈ సినిమాపై మాత్రం అంచనాలు పెంచేసుకున్నాడు.

Telugu Atlee Kumar, Jawan, Nayanthara, Shahrukh, Shahrukh Khan-Movie

జవాన్ సినిమా( Jawan Movie )పై టాక్ చూస్తుంటే ఇక మాటల్లేవ్ అనే చెప్పాలి.ఎందుకంటే ఫ్యాన్స్ కు జవాన్ ఫుల్ కిక్ ఎక్కించింది.57 ఏళ్ల వయసులో కూడా ఫిట్ గా కుర్ర హీరోలకు పోటీగా షారుఖ్ ఈ సినిమాలో స్క్రీన్ ప్రెజెన్స్ తో అదరగొట్టాడు.పఠాన్ సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్న షారుఖ్( Shah Rukh Khan ) అదే విజయాన్ని జవాన్ తో కొనసాగిస్తున్నాడు.

తన రికార్డ్ ను తానే తిరగరాసేలా ఉన్నాడు.

జవాన్ ప్రీ బిజినెస్ తోనే బాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసేసింది.పఠాన్ వరల్డ్ వైడ్ గా 100 కోట్ల మార్క్ ను దాటేయగా ఇప్పుడు జవాన్ ఆ రికార్డ్ ను క్రాస్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసాడు.

జవాన్ సినిమా మొదటి రోజు ఏకంగా 150 కోట్లు( Jawan Movie First Day Collections ) దాటేసినట్టు తెలుస్తుంది.నిన్న సెప్టెంబర్ 7న రిలీజ్ అయిన ఈ సినిమా తెలుగు, తమిళ్, హిందీ, మలయాళ భాషల్లో రిలీజ్ అయ్యింది.

Telugu Atlee Kumar, Jawan, Nayanthara, Shahrukh, Shahrukh Khan-Movie

ఇండియా వైడ్ గా 75 కోట్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేయగా వరల్డ్ వైడ్ గా 150 కోట్లు దాటేసింది.షారుఖ్ ఖాన్ హీరోగా నయనతార హీరోయిన్ గా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో జవాన్ తెరకెక్కగా విజయ్ సేతుపతి విలన్ గా కనిపించి మెప్పించాడు.ఇక ఈ కలెక్షన్స్ చూస్తుంటే జవాన్ మానియా ఇప్పట్లో ఆగేలా లేదు.ముందు 1000 కోట్లు రాబడుతుంది అని టాక్ రాగా ఇప్పుడు 1500 కోట్లు వచ్చిన ఆశ్చర్యం లేదు అని అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube