'శాకుంతలం' యూఎస్ కలెక్షన్స్.. అఫిషియల్ డిటైల్స్ ఇవే!

ఈ శుక్రవారం థియేటర్స్ లో సందడి చేసిన సినిమాల్లో ”శాకుంతలం” (Shaakuntalam) ఒకటి.గత కొన్నాళ్ల నుండి కొన్ని అనుకోని కారణాల వల్ల మేకర్స్ రిలీజ్ డేట్ ప్రకటిస్తూ మళ్ళీ వాయిదా వేస్తూ వస్తున్నారు.

 Shaakuntalam Collects $125k At Us Box Office On Day 1, Shaakuntalam, Samantha, G-TeluguStop.com

మరి ఎట్టకేలకు ఏప్రిల్ 14న గ్రాండ్ గా పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమా రిలీజ్ అయ్యింది.టాలెంటెడ్ డైరెక్టర్ గుణశేఖర్ (Gunasekhar) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పౌరాణిక నేపథ్యంలో గ్రాండ్ గా నిర్మాణ విలువలతో భారీ స్థాయిలో నిర్మించారు.

స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు (Samantha) , దేవ్ మోహన్ ప్రధాన పాత్రల్లో ఈ సినిమా తెరకెక్కింది.ఈ సినిమా కోసం సమంత అభిమానులు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నారు.

మరి ఈ మోస్ట్ అవైటెడ్ సినిమా నిన్న థియేటర్స్ లోకి వచ్చింది.కానీ అనుకున్న విధంగా అయితే హిట్ టాక్ తెచ్చుకోలేదు.

ఈ సినిమాకు ఫ్యాన్స్ నుండి కూడా మిశ్రమ స్పందన లభించింది.

Telugu Gunasekhar, Samantha, Shaakuntalam-Movie

ఇదిలా ఉండగా ఈ సినిమా ఓవర్సీస్ లో కూడా భారీ స్థాయిలోనే రిలీజ్ చేసారు.తాజాగా యూఎస్ కలెక్షన్స్ (US box office) పై నిర్మాణ సంస్థ అఫిషియల్ గా పోస్టర్ రిలీజ్ చేసింది.శాకుంతలం సినిమా యూఎస్ లో మొదటి రోజు 125కే డాలర్స్ రాబట్టినట్టు పోస్టర్ ద్వారా అధికారికంగా అనౌన్స్ చేసారు.

ఈ సినిమాను రాధాకృష్ణ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ద్వారా యూఎస్ లో రిలీజ్ చేసారు.

Telugu Gunasekhar, Samantha, Shaakuntalam-Movie

మరి ఈ సినిమా మిశ్రమ టాక్ తెచ్చుకోవడంతో ముందు ముందు ఎలాంటి కలెక్షన్స్ రాబడుతుందో చూడాలి.టాక్ ఎలా ఉన్న వీకెండ్ మాత్రం కలెక్షన్స్ బాగానే వచ్చే అవకాశం ఉంది.ఇక ఈ సినిమా ఇండియాలో ఫస్ట్ డే ఎంత రాబట్టిందో ఇంకా అప్డేట్ రాలేదు.

మరి 8 ఏళ్ల తర్వాత శాకుంతలం సినిమాతో వచ్చిన గుణశేఖర్ సామ్ కు గ్రాండ్ హిట్ ఇస్తాడో లేదో రెండు రోజులు గడిస్తే తెలిసే అవకాశం ఉంది.కాగా గుణ టీమ్ వర్క్స్ బ్యానర్ పై నీలిమ గుణ మరియు దిల్ రాజు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు.

ఈ సినిమాలో అల్లు అర్జున్ డాటర్ అల్లు అర్హ ప్రిన్స్ భరతుడిగా కనిపించి తన నటనతో ఆకట్టుకుంది.ఈమెకు ఈ సినిమాలో చేసిన రోల్ కు ప్రశంసలు దక్కుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube