తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 6 నుండి జరుగబోతున్న ఇంటర్మీడియట్ పరీక్షలకు నిమిషం నిబంధనను ఏత్తివేయాలని ఎస్ ఎఫ్ ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్ష, కార్యదర్శిలు ఆర్ ఎల్ మూర్తి, టి నాగరాజు డిమాండ్ చేశారు ఈ మేరకు మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు.వేసవికాలం కావడం రీత్యా విద్యార్ధులు దూర ప్రాంతాలకు వెళ్ళారని, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న విద్యార్ధులు ప్రయాణ సౌకర్యం లేని గ్రామాలున్నాయని, పేద విద్యార్థులు ఖచ్చితమైన సమయంలో చేరుకునే అవకాశం లేదు, ఈ నిబంధనలు వలన అనేక మంది విద్యార్థులు పరీక్ష నష్టపోయ్యే అవకాశం ఉంటుంది.
ప్రక్క రాష్ట్రం ఆంద్రప్రదేశ్ అర గంట లేట్ గా అయినా అనుమతి ఇస్తున్నారని కానీ తెలంగాణా రాష్ట్రంలో ఈ నిబంధనలు వల్లన రాష్ట్ర విద్యార్ధులకు నష్టం జరుగుతుందన్నారు.తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ బోర్డు తీరు మారడం లేదని, వివాదాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
ఇంటర్మీడియట్ బోర్డు విద్యార్ధులకు నష్టం చేసే చర్యలు మానుకోకుంటే ఎస్.ఎఫ్.ఐ.ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తామని వారు హెచ్చరించారు.