తెలంగాణ: హరిత నిధి పేరుతో విద్యార్థుల నుండి నిధి వసూలు చేసే విధానాన్ని ఖండిస్తున్నాం- ఎస్ ఎఫ్ ఐ

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ హరిత నిధి పేరుతో రాష్ట్రంలోని విద్యార్థులు మరియు వేర్వేరు వర్గాల ఉద్యోగులు , వ్యాపారుల నుండి బలవంతంగా నిధి వసూళ్ళు చేయడాన్ని భారత విద్యార్థి ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఖండించింది .

రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ హరిత నిధి సమీకరణ విధానాన్ని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష , కార్యదర్శులు ఆర్ఎల్ మూర్తి , టి నాగరాజు ఒక ప్రకటనలో ఖండించారు .

వారు మాట్లాడుతూ తెలంగాణ హరిత నిధి పేరుతో విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో , కళాశాలల్లో అడ్మిషన్ అయ్యే క్రమంలో ప్రాథమిక పాఠశాల విద్యార్థులు నుండి 5 రూపాయలు , హైస్కూల్ విద్యార్థుల నుండి 15 రూపాయలు , ఇంటర్మీడియట్ విద్యార్థుల నుండి 25 రూపాయలు , డిగ్రీ విద్యార్థుల నుండి 50 రూపాయలు , పీజీ మరియు ప్రొఫెషనల్ కోర్సుల విద్యార్థులు నుండి 100 రూపాయలు చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోందన్నారు .అదే విధంగా వేర్వేరు వర్గాల ఉద్యోగులు , వ్యాపారుల నుండి ట్రేడ్ లైసెన్స్ వాణిజ్య వ్యాపారుల నుండి 1000 రూపాయలు , ఐఏఎస్ , ఐపిఎస్ వేతనాలు నుండి 100 , ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీల వేతనాల నుండి 500 రూపాయలు , టిజీవో , టిఎన్జీవో ఉ ద్యోగుల వేతనాల నుండి 25 రూపాయిలు వసూళ్లు చేయనున్నారు .ప్రతీ రెవెన్యూ భూమి అమ్మకం , కొనుగోలుపై 50 రూపాయలు వసూళ్లు చేయనున్నారు .తెలంగాణ హరిత నిధి పేరుతో బలవంతంగా విద్యార్థులు , ఉద్యోగులు , వ్యాపారుల నుండి వసూళ్లు చేయడం సరియైనది కాదన్నారు .ఏ ప్రభుత్వ ఖాతా ద్వారా ఈ డబ్బంతా నిర్వహిస్తున్నారో , ఇప్పటికీ ఎంత వసూళ్లు చేసారో శ్వేత పత్రం విడుదల చేయాలని కోరారు .కేంద్రం పిఎం కేర్ ఫండ్ తరహాలోనే ఇది కూడా ఒక బోగస్ ఖాతా ద్వారా వసూళ్ళు చేసేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తోందన్నారు .దీనిని సబ్బండ వర్గ ప్రజలు , ప్రజాస్వామిక వాదులు , మేధావులు ఖండించాలని కోరారు .

పుష్ప 2 పై అంబటి కామెంట్స్ .. వారిని అరెస్ట్ చేయకపోవడంపై ఫైర్ 

తాజా వార్తలు