YCP Cm Jagan : ఏడో లిస్ట్ రెఢీ … వైసీపీ నేతల్లో టెన్షన్ టెన్షన్

ఇప్పటికే ఆరు విడతలుగా వైసిపి( YCP ) అభ్యర్థుల జాగుతాను ప్రకటించిన జగన్, ఈ ఆరు విడతల్లో దాదాపు 67 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ, 18 లోక్ సభ నియోజకవర్గాల్లోనూ అభ్యర్థుల మార్పు చేర్పులు చేపట్టారు.ఈ జాబితాల్లో కొంతమందికి టికెట్లు నిరాకరించగా, మరికొంతమందికి రాజ్యసభ సభ్యులుగా, ఇంకొంతమందికి ఎమ్మెల్యే టికెట్ నిరాకరించి పార్లమెంట్ అభ్యర్థిగా అవకాశం కల్పించారు.

 Seventh List Ready Tension Tension Among Ycp Leaders-TeluguStop.com

మరి కొంత మందికి మరో అసెంబ్లీ నియోజకవర్గంలో అవకాశం కల్పించారు.ఎట్టి పరిస్థితుల్లోనైనా వచ్చే ఎన్నికల్లో గెలిచి తీరాలనే పట్టుదలతో జగన్ ఉన్నారు.

అందుకే సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ఏ చిన్న వ్యతిరేకత ఉన్నా.వారిని పక్కన పెట్టి కొత్తవారికి అవకాశం ఇస్తున్నారు.

వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందిన వారంతా మళ్లీ తమకు అవకాశం కల్పిస్తారు అని, తప్పకుండా తమ పార్టీనే గెలిపిస్తారనే నమ్మకంతో జగన్( YS Jagan Mohan Redd ) ఉన్నారు.తమ రాజకీయ ప్రత్యర్థులంతా ఏకమై వచ్చినా సరే తమ గెలుపునకు డోఖా ఉండదు అనే లెక్కల్లో జగన్ ఉన్నారు.

Telugu Ap, Jagan, Uttarandhra, Ycp, Ys Jagan, Ysrcp, Ysrcpmla-Politics

ఆ ధీమాతోనే ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నారు.ఇక టికెట్ దక్కని వారిని బద్ధకించే పనికి జగన్ శ్రీకారం చుట్టారు.మళ్ళీ పార్టీ అధికారంలోకి వస్తే సముచిత స్థానం కల్పిస్తామని, కీలక పదవులు కట్టబెడతామని జగన్ హామీ ఇస్తున్నారు.జగన్ హామీతో కొంతమంది సైలెంట్ గా ఉంటుండగా, మరి కొంత మంది మాత్రం అసంతృప్తితో పార్టీ మారిపోతున్నారు.

ప్రస్తుతం ఏడో జాబితాకు సంబంధించి జగన్ కసరత్తు పూర్తి చేయడంతో.వీలనంత తొందరగా అభ్యర్థుల జాబితాను ప్రకటించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

Telugu Ap, Jagan, Uttarandhra, Ycp, Ys Jagan, Ysrcp, Ysrcpmla-Politics

ఈ ఏడో జాబితాలో ఉత్తరాంధ్ర( Uttarandhra ) జిల్లాలకు సంబంధించిన నియోజకవర్గాలు ఎక్కువ ఉన్నట్లు గా వైసీపీ కీలక నాయకులు కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.రేపో , ఎల్లుండో అభ్యర్థులు జాబితాను విడుదల చేసేందుకు జగన్ సిద్ధమవుతున్నారు.దీంతో ఏడో జాబితాలోఎవరి పేరు ఉంటుందో, ఎవరి పేరు గల్లంతు అవుతుందో తెలియక ఆయా నియోజకవర్గాల ఆశావాహుల్లో టెన్షన్ పెరిగిపోతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube