దంతాల‌ను దృఢంగా మార్చే నువ్వులు..ఎలా తీసుకోవాలంటే?

మ‌న శ‌రీరంలో అత్యంత గ‌ట్టిగా ఉండే వాటిలో దంతాలు ముందు వ‌రుస‌లో ఉంటాయి.కానీ, నేటి కాలంలో చాలా మంది దంతాల బ‌ల‌హీన‌త‌ను ఎదుర్కొంటారు.

ఆహార‌పు అల‌వాట్లు, దంత సంర‌క్ష‌ణ లేక‌ పోవ‌డం, పోష‌కాల లోపం, బ్యాక్టీరియా, ధూమ‌ పానం, షుగ‌ర్స్ ఎక్కువ‌గా తీసుకోవ‌డం ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల దంతాల ఆరోగ్యం డ్యామేజ్ అవుతుంది.ఫ‌లితంగా దంతాలు బ‌ల‌హీన ప‌డిపోతాయి.

ఈ క్ర‌మంలోనే బ‌ల‌హీన ప‌డిన దంతాల‌ను మ‌ళ్లీ ఎలా బ‌లంగా మార్చుకోవాలో తెలియ‌క తెగ స‌త‌మ‌త‌మ‌వుతుంటారు.అయితే దంతాల‌ను దృఢంగా మార్చ‌డంలో కొన్ని కొన్ని ఆహారాలు ఎఫెక్టివ్‌గా ప‌ని చేస్తాయి.

అలాంటి వాటిలో నువ్వులు కూడా ఉన్నాయి.నువ్వులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌ని అంద‌రికీ తెలుసు.

Advertisement

నువ్వుల్లో ఐర‌న్‌, కాల్షియం, కాప‌ర్‌, విట‌మిన్ ఇ, విటిమ‌న్ కె, ప్రొటీన్లు, ఆరోగ్యకరమైన పిండి పదార్థాలు, యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా ఎన్నో పోష‌కాలు ఉంటాయి .

అందుకే నువ్వులతో పాటు నువ్వుల నూనెను కూడా విరి విరిగా వాడుతుంటారు.నువ్వులు ఎన్నో జ‌బ్బుల‌ను నివారిస్తాయి.అలాగే దంతాల‌ను బ‌లంగా మార్చ‌డంలోనూ నువ్వులు ఉప‌యోగ‌ప‌డ‌తాయి.

నువ్వుల్లో ఉండే కొన్ని ప్ర‌త్యేక‌మైన పోష‌కాలు.నోట్లో ఉండే బ్యాక్టీరియాను అంతం చేయ‌డంతో పాటు పళ్ల ఎనామిల్ నిర్మాణానికి సహాయపడ‌తాయి.

మ‌రియు నువ్వుల్లో ఉండే కాల్షియం, విట‌మిన్ కె దంతాల‌ను దృఢంగా మారుస్తాయి.మ‌రి నువ్వుల‌ను ఎలా తీసుకోవాలి అన్న డౌట్ మీకు వ‌చ్చే ఉంటుంది.

బన్నీ, విష్ణు పక్కనున్న ఈ బుడ్డోడు ఎవరో తెలుసా.. ఈ సీరియల్ నటుడిని గుర్తు పట్టలేరుగా!
వైరల్ వీడియో : పరాయి వ్యక్తితో ఉన్న భార్యను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న కానిస్టేబుల్

అక్క‌డికే వ‌స్తున్నా.నువ్వులను ముందుగా శుభ్రంగా క‌డిగి ఆర‌బెట్టుకోవాలి.

Advertisement

ఆ నువ్వుల‌ను రోజుకు రెండు స్పూన్ల చ‌ప్పున నోట్లో వేసుకుని బాగా న‌మిలి తినాలి.లేదా ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని పాల‌లో నువ్వుల పొడి మ‌రియు బెల్లం పొడి క‌లిపి సేవించాలి.

తాజా వార్తలు