భారత్- ఆస్ట్రేలియా( India- Australia ) మూడవ వన్డే మ్యాచ్ లో భారత్ గెలిచె అవకాశాలు ఎక్కువగా ఉండేవి.గెలిచే మ్యాచ్ ఓడిపోవడం తో అభిమానులు ఫైర్ అవుతున్నారు.
క్రీజు లో నిలబడకుండా తొందరగా అవుట్ అవ్వాల్సిన అవసరం ఏముంది.తొందరపడి చేదించాల్సిన లక్ష్యం అంతా పెద్దది కాదు.గెలవాల్సిన చోట కాస్త తడబడి అనవసరంగా ఆస్ట్రేలియా చేతికి టైటిల్ సమర్పించుకుంది రోహిత్ సేన.270 పరుగుల లక్ష్య చేదనలొ ఓపెనర్లు గిల్, రోహిత్ శర్మలు అవుట్ అయ్యే సమయానికి భారత్ 74 పరుగులు చేసింది.తర్వాత బరిలోకి దిగిన విరాట్ కోహ్లీ 54 పరుగులకు అవుట్ అయ్యాడు.కేఎల్ రాహుల్ 32 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.అక్షర పటేల్ దురదృష్టవశాత్తు అనవసరంగా రన్ అవుట్ అయ్యాడు.దూకుడుగా ఆడుతున్న హార్దిక్ పాండ్యా( Hardik Pandya ) 40 పరుగులు చేసి రాంగ్ షార్ట్ కొట్టి ఔట్ కావడం తో మ్యాచ్ కీలక మలుపు తిరిగింది.

ఇక మ్యాచ్లో సూర్య కుమార్ యాదవ్( Surya Kumar Yadav ) ఫస్ట్ బంతికే అవడం కూడా దురదృష్టం అనే చెప్పాలి.సూర్య కుమార్ యాదవ్ నిలబడి ఉన్న కూడా మ్యాచ్ సులభంగా గెలిచే అవకాశం ఉండేది.రవీంద్ర జడేజా( Ravindra Jadeja ) కాస్త ఒత్తిడికి లోనయి 18 పరుగుల తర్వాత క్యాచ్ అవుట్ కావడంతో విజయం ఎవరిదో తేలిపోయింది.చివరలో వచ్చిన షమీ 10 బంతులలో 14 పరుగులు చేసి అవుట్ కావడంతో 21 పరుగుల తేడాతో భారత్ ఓడింది.
ఇక ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ బౌలర్లను మారుస్తూ, భారత బ్యాటర్లపై చేసిన ప్రయోగం ఫలించింది.ఆస్ట్రేలియా బౌలర్లలో జంపా బౌలింగ్ ప్రత్యేకంగా నిలిచింది.గిల్, రాహుల్, పాండ్యా, కోహ్లీ ల కీలకమైన నాలుగు వికెట్లు తీయడంతో భారత్ ఓటమిని చవిచూసింది.ఇక క్రికెట్ అభిమానులు గెలవాల్సిన మ్యాచ్ లో ఒత్తిడికి గురై చిత్తుగా ఓడిన భారత జట్టు వరల్డ్ కప్ ఎలా సాధిస్తుంది.
సొంత దేశంలో సిరీస్ దక్కించుకోలేకపోవడం చాలా బాధాకరం.అనవసరంగా వన్డే సిరీస్ టైటిల్ ను చేజేతులా వదులుకున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.
