Shanthi Williams: షూటింగ్లో ఏ ఇబ్బంది వచ్చిన ఇంటికి వచ్చి భార్యను చితకబాదే గొప్ప వ్యక్తి

ఒక్కోసారి తమ కెరియర్ లో ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా వారి బుద్ధులు చాలా నీచంగా ఉంటాయి.

సినిమా ఇండస్ట్రీ( Film Industry )లో ఇవి సర్వసాధారణం.

బయట జరిగే ప్రతి పరిస్థితిని ఇంటికి తీసుకు వచ్చి వారి బార్యలపై మరోలా చూపించే వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు.ఉదాహరణకు విలియమ్స్( Cinematographer Williams ) అనే మలయాళ సినిమాటోగ్రాఫర్ గురించి తెలియని వారు ఉండరు.

ఆయన మలయాళంలో చాలా పెద్ద సినిమాటోగ్రాఫర్.సొంతంగా సినిమాలను కూడా తీశాడు, చూడ్డానికి చింపిరి జుట్టుతో, మాసిపోయిన బట్టలతో, నెరిసిన గడ్డంతో వేగటు పుట్టించే విధంగా ఉంటాడు.

కానీ అప్పటికే నటిగా ఉన్న శాంతి9 Shanti ) అనే అమ్మాయిని ప్రేమించి ఆమెకు, ఆమె ఇంట్లో వారిని బలవంత పెట్టి ఇష్టం లేకపోయినా వివాహం చేసుకున్నాడు.ఆ రోజు అంత పెద్ద వ్యక్తిని కాదని ఎదిరించే దైర్యం శాంతికి లేకపోయింది.

Advertisement

అయితే విలియమ్స్ ఎంత గొప్పవాడు అంటే అతని ఇంటికి మమ్ముట్టి, మోహన్ లాల్( Mohan Laal ), సురేష్ గోపి లాంటి పెద్ద హీరోస్ అందరూ వచ్చి భోజనం చేసి వెళ్లేవారు.వర్క్ పరంగా అతడు చాలా గొప్పవాడు కావచ్చు.కానీ ఒక భర్తగా మాత్రం ఒక ఫెయిల్యూర్.

షూటింగ్లో ఎవరి మీద కోపం వచ్చినా ఇంటికి వచ్చి భార్య( Wife )ను ఎన్నోసార్లు చితక బాదేవాడు.ఇక షూటింగ్ సెట్లో కూడా ఓసారి అందరి ముందే ఆమెను కొట్టి కారులో వేసి తాళం పెట్టి వెళ్లిపోయాడు.

పెళ్లయ్యాక సినిమాలు మానిపించాడు.నలుగురు పిల్లలు పుట్టారు.

ఎలాంటి సహాయ సహకారాలు లేకుండా కుటుంబాన్ని ఒక్కతే చూసుకోవాల్సి వచ్చింది.ఎంత చెప్పినా వినకుండా ఆస్తులన్నీ తాకట్టు పెట్టి సినిమాలు తీసి రోడ్డు మీదకు వచ్చాడు.

మెకానిక్‌కి జాక్‌పాట్‌ .. రూ.25 కోట్ల లాటరీ తగలడంతో..
బాబోయ్, బిగ్‌బాస్ హౌస్‌ నిండా మెంటల్ కేసులే.. జుట్టు పీక్కుంటున్న ప్రేక్షకులు..

వేలంలో ఆస్తులన్నీ పోయాక అతడికి పక్షవాతం వచ్చిన సరే శాంతి భర్తను పిల్లల్ని ఒంటరిగానే చూసుకుంది.శాంతి గురించి చెప్పాలంటే మెట్టెల సవ్వడి సీరియల్ లో అత్త పాత్రలో నటించింది.

Advertisement

గొప్ప వ్యక్తిగా సినిమాల్లో ఉన్నాడు కాబట్టి బ్రతికున్నంత కాలం అందరూ వచ్చేవారు.కానీ ఆయన చనిపోయిన తర్వాత అనాధ శవంలా మిగిలాడు.ఏ ఒక్కరు అతడిని చూడడానికి రాలేదు.

కేవలం భార్య పిల్లలు మాత్రమే అంతిమ సంస్కారాలు చేశారు.అలా ఇంట్లో వారిని బాధపెట్టి విలియమ్స్ దక్కించుకుంది ఏమీ లేదు పోయాక కూడా పట్టించుకున్న నాథుడే లేదు.

ఈమాత్రం దానికి సినిమాపై లేదా సినిమా వల్ల వచ్చిన ఇబ్బందులను ఇంటికి తీసుకొచ్చి భార్యపై తన ప్రతాపాన్ని చూపించే వాడు.దానివల్ల అటు భార్య ప్రేమని ఇటు కుటుంబం అభిమానాన్ని కోల్పోయాడు.

చివరిగా ఇండస్ట్రీ కూడా పట్టించుకోలేదు.

తాజా వార్తలు