తెలుగు చలనచిత్ర పరిశ్రమలో బాగా సక్సెస్ అయిన లేడీ డైరెక్టర్లలో విజయనిర్మల( Vijaya Nirmala ) ఒకరు.రామ్ రాబర్ట్ రహీమ్, అజాతశత్రువు, డాక్టర్ సినీ యాక్టర్ వంటి చెప్పుకోదగిన సినిమాలను విజయ నిర్మల డైరెక్ట్ చేశారు.
దర్శకురాలి గా కంటే నటిగా ఈమె చాలా సక్సెస్ అయ్యారు.సూపర్ స్టార్ కృష్ణతో( Superstar Krishna ) వరుసగా అనేక మూవీలు చేస్తూ అనేక సూపర్ హిట్స్‌ను తన ఖాతాలో వేసుకున్నారు.
ఇండస్ట్రీలో ఈమెకు మంచి పేరు ఉంది.చాలామంది ప్రముఖులతో ఆమె మంచి అనుబంధం పంచుకుంది.
అయితే వీళ్లు మాత్రమే కాదు ప్రముఖ రచయిత్రి యద్దనపూడి సులోచన రాణితో( Yaddanapudi Sulochana Rani ) కూడా విజయనిర్మలకు మంచి స్నేహం కుదిరింది.
ఆ స్నేహంతోనే ఆమె రాసిన చాలా ఓ నవలను సినిమాగా తెరకెక్కించారు విజయనిర్మల.
ఈ సినిమా పేరు మీనా.( Meena ) 1973లో ఈ మూవీ వచ్చింది.
మీనా అనే పేరు గల నవల ఆధారంగా ఈ సినిమాను తీశారు.అ ఆ! సినిమా కూడా సేమ్ నవల ఆధారంగా రూపొందించారు.
విజయనిర్మల తొలిసారిగా తీసిన మీనా మూవీలో సూపర్ స్టార్ కృష్ణ హీరోగా నటించాడు.విజయనిర్మల ఈ మూవీలో హీరోయిన్ గా కూడా యాక్ట్ చేసి మెప్పించింది.
ఈ మూవీ సూపర్ హిట్ అయింది.

దీనివల్ల కృష్ణ చాలా సంతోషించాడు.ఆమెతో కలిసి మరిన్ని సినిమాలు చేశాడు.ఇకపోతే యద్దనపూడి సులోచనా రాణి తెలుగు నవలా రచయిత్రి, ఆమె 1970లు, 1980ల నుంచి ముఖ్యంగా మహిళలలో సూపర్ పాపులర్ అయ్యారు.
ఆమె కథలు చాలా వరకు సినిమాలు, టీవీ షోలుగా తీశారు.ఆమె చేసిన కృషికి రెండు నంది అవార్డులు కూడా అందుకున్నారు.

ఇకపోతే విజయనిర్మల కృష్ణతో చాలా సినిమాలు తీసేయ్ చివరికి అతనికి బాగా దగ్గరయ్యారు.ఆయనకు రెండో భార్య అయి జీవితాన్ని కూడా పంచుకున్నారు.ఇక యద్దనపూడి సులోచన రాణి నవలలు చదువుతూ విజయనిర్మల చాలా ముగ్ధులయ్యే వారు అందుకే ఆమెతో ఫ్రెండ్‌షిప్ చేశారు.విజయనిర్మల మంచితనం ప్రతిభను చూసి యద్దనపూడి సులోచన రాణి కూడా ఆమెతో స్నేహం చేశారు.
సినిమా విషయాలు కాకుండా చాలా వ్యక్తిగత విషయాలను కూడా పంచుకునేవారు.వీరి స్నేహం అప్పట్లో ప్రజల్లో ఎప్పుడూ ఆసక్తికర అంశంగానే ఉండేది.