సీఎం జగన్ కి భయం పట్టుకుంది అంటూ టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు.

ఏపీలో మరో మూడు నెలలలో ఎన్నికలు( AP Elections ) జరగనున్నాయి.ఈ క్రమంలో ఏపీ రాజకీయాలలో కీలక పరిణామం చోటుచేసుకుంది.

టీడీపీ సీనియర్ నేత విశాఖ నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు( Ganta Srinivasa Rao ) రాజీనామాకు అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆమోదం తెలిపారు.ఈనెల 22వ తారీఖున ఘంటా రాజీనామాకు ఆమోదం ఇచ్చినట్లు స్పష్టం చేశారు.ఈ మేరకు అసెంబ్లీ సెక్రటరీ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.2022వ సంవత్సరంలో విశాఖ స్టీల్ ప్లాంట్( Vishaka Steel Plant ) ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ గంటా శ్రీనివాసరావు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.ఈ మేరకు రాజీనామా లేఖను స్పీకర్ కి అందించారు.

Sensational Comments Of Tdp Leader Ganta Srinivasa Rao Saying That Cm Jagan Is A

తాజాగా పెండింగ్ లో ఉన్న గంటా రాజీనామా. స్పీకర్ ఆమోదించటం సంచలనంగా మారింది.ఈ పరిణామంపై గంటా శ్రీనివాసరావు సీఎం జగన్ పై( CM Jagan ) సంచలన వ్యాఖ్యలు చేశారు.

త్వరలో రాజ్యసభ ఎన్నికలు( Rajyasabha Elections ) జరగనున్నాయి.ఈ రాజ్యసభ ఎన్నికల విషయంలో సీఎం జగన్ కి భయం పట్టుకుంది.మూడు ఏళ్ల క్రితం రాజీనామా చేస్తే ఎన్నికలకు మూడు నెలలు ముందు ఆమోదిస్తారా అంటూ మండిపడ్డారు.

Advertisement
Sensational Comments Of TDP Leader Ganta Srinivasa Rao Saying That CM Jagan Is A

కనీసం తనను సంప్రదించలేదని పేర్కొన్నారు.సీఎం జగన్ లో రాజ్యసభ ఎన్నికల భయం కనిపిస్తుంది.

ఇందులో ఓటు వినియోగించుకోవడానికి న్యాయ సలహా తీసుకొని ప్రయత్నిస్తానంటూ గంటా శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు.

Advertisement

తాజా వార్తలు