ఎన్టీఆర్ జిల్లా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు.పది మంది రౌడీలను వెంటేసుకొని తిరగడం చేతగాక పాత తరం నాయకుడిలా మిగిలిపోయానన్నారు.
తాను పుట్టినప్పటి నుంచి తన తండ్రి రాజకీయాల్లో ఉన్నారన్న ఆయన 55 ఏళ్లుగా తమ కుటుంబం రాజకీయాల్లో ఉందని చెప్పారు.అప్పటి రాజకీయాలతో పోలిస్తే ఇప్పటి రాజకీయాలు మారిపోయాయని తెలిపారు.
రౌడీలను వెంటేసుకొని వారిలా తిరిగితేనే ముందుకు వెళ్లే పరిస్థితులు ఉన్నాయని పేర్కొన్నారు.ఒక్కోసారి రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యే ఎందుకయ్యానా అని బాధపడుతున్నట్లు వెల్లడించారు.
మూడేన్నరేళ్లలో ఎవరిపై అక్రమ కేసులు బనాయించలేదని, ఎవరికీ సంక్షేమ పథకాలు ఆపలేదని చెప్పారు.అక్రమ కేసుల విషయంలో కొందరు నేతలకు తనపై అసంతృప్తి ఉందని తెలిపారు.







