మాజీ ఎంపీ బొత్స ఝాన్సీలక్ష్మీ సంచలన వ్యాఖ్యలు చేశారు.వైసీపీ అధిష్టానం ఆదేశిస్తే విశాఖ ఎంపీగా పోటీకి సిద్ధమని తెలిపారు.
విశాఖకు తాను స్థానికురాలినని ఝాన్సీలక్ష్మీ పేర్కొన్నారు.బీసీ మహిళగా, స్థానికురాలిగా తనకు అన్ని అర్హతలు ఉన్నాయని తెలిపారు.
తన గురించి ఉత్తరాంధ్ర పరిచయం అవసరం లేదని వెల్లడించారు.పార్టీ చెప్పినట్లుగానే నడుచుకున్నామన్న ఆమె సీటు విషయంపై ఏం నిర్ణయం తీసుకున్న దాన్ని పాటిస్తామని స్పష్టం చేశారు.







