పాలకొల్లులో సామాజిక సాధికార బస్సు యాత్రలో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు..!!

వైసీపీ రాష్ట్రవ్యాప్తంగా సామాజిక సాధికార బస్సుయాత్ర నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.రాష్ట్రంలో మూడు ప్రాంతాలలో ఈ బస్సు యాత్ర దిగ్విజయంగా సాగుతోంది.

అయితే 11వ రోజు ఒకపక్క పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో అదేవిధంగా పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో బస్సు యాత్ర జరుగుతూ ఉంది.పాలకొల్లు సామాజిక సాధికార బస్సు యాత్రలో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు.

గతంలో అబద్ధం అధికారంలో ఉంది అంటూ చంద్రబాబు పై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.ఎన్నికల సమయంలో నాలుగు మాయ మాటలు చెప్పి అధికారంలోకి రావాలని గత పాలకులు అనుకుంటున్నారు.

మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను 90 శాతం అమలు చేసిన నాయకుడు సీఎం జగన్ అని స్పష్టం చేశారు.

Advertisement

139 బీసీ కులాలను గుర్తించి వారి సామాజిక స్థితి పెరగటానికి అండగా నిలిచారు అని కొనియాడారు.బీసీ వర్గాలను అణిచివేసిన వ్యక్తి చంద్రబాబు అని మండిపడ్డారు.పేదరికంపై యుద్ధం చేయాలంటే ఆయుధం విద్య అని ఆనాడు అంబేద్కర్ చెప్పారు.

ఈనాడు అంబేద్కర్ కి నిజమైన వారసుడిగా విద్యకు సీఎం జగన్ అత్యంత ప్రాధాన్యత ఇచ్చినట్లు మంత్రి వేణు పేర్కొన్నారు.విద్యకు సంబంధించిన అనేక పథకాలతో పేదలకు చదువు భారం కాకుండా చూసుకున్నారని వ్యాఖ్యానించారు.

ఫీజు రియంబర్స్మెంట్ కు కోతలు పెట్టిన దుర్మార్గుడు చంద్రబాబు.అన్ని వర్గాల నాయకులకు సీఎం జగన్ మంత్రి మండలిలో చోటు కల్పించి ప్రాధాన్యత ఇచ్చారు.

బీసీ కులాలకు ఆత్మగౌరవాణి నింపిన వ్యక్తి సీఎం జగన్ అని మంత్రి చెల్లుబోయిన వేణు ప్రసంగించారు.

చంద్రబాబు క్లారిటీతో ఉన్నారా ? అందుకే ఆ స్టేట్మెంట్ ఇచ్చారా ?
Advertisement

తాజా వార్తలు