ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు.. టీఆర్ఎస్ నేతల ఫోన్ ట్యాప్?

మొయినాబాద్ ఫాంహౌజ్ ఎపిసోడ్‌లో భాగంగా లీకైన ఆడియోలపై బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్విట్టర్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు.

టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి ఎనిమిదేళ్లు పూర్తి చేసుకుంది.

ఈ ఎనిమిదేళ్ల పాలనలో తెలంగాణలో లక్షల ఫోన్లు ట్యాప్‌కు గురవుతూనే ఉన్నాయని ప్రవీణ్ కుమార్ ఆరోపించారు.ఈ క్రమంలో మునుగోడు ప్రజలను ఉద్దేశించి కీలక సూచనలు అందజేశారు.

ఈ సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.‘గత ఎనిమిదేళ్ల నుంచి కొన్ని లక్షల ఫోన్లు ట్యాపింగ్‌కు గురవుతున్నాయి.

రాష్ట్రంలో గడీల పాలన, కుటుంబ పాలన కొనసాగుతూ ఉంటే ఇలానే జరుగుతుంది.మునుగోడు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఒకటే విషయం చెప్పాలని అనుకుంటున్నాను.

Advertisement
Sensational Comments By Rs Praveen Kumar RS Praveen Kumar, BSP, TRS, BJP, Munug

మీ ఫోన్లు కూడా ట్యాప్ అవుతున్నాయి.జాగ్రత్త పడండి.

ఇలాంటి ప్రభుత్వం కోసమా మీరు కష్టపడుతున్నది.ఇలాంటి పాలనకు చరమగీతం పాడాల్సిన సమయం వచ్చింది.

అది కేవలం ఏనుగు గుర్తుతోనే సాధ్యం.మీ దొర ఇచ్చింది తీసుకోండి.

బీఎస్పీ పార్టీకి ఓటు వేయండి.’ అంటూ పిలుపునిచ్చారు.

Sensational Comments By Rs Praveen Kumar Rs Praveen Kumar, Bsp, Trs, Bjp, Munug
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025

మునుగోడు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మరో వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేశారు.ఈ వీడియోలో ఓ ఛానెల్ సర్వే నిర్వహిస్తోంది.ఓ పెద్దాయనకు ఎవరికి ఓట్లు వేస్తారని అడిగితే.

Advertisement

అతను ‘ఓట్ల కోసం అన్ని పార్టీలు బంగారం పంచినా, డబ్బులిచ్చినా తీసుకుంటాం.కానీ బీఎస్పీ పార్టీ అభ్యర్థి శంకరా చారికి మాత్రమే ఓటు వేస్తాం.

’ అని ఉంది.ఈ వీడియోను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ షేర్ చేస్తూ.

‘పార్టీలకు అమ్ముడు పోయి ఫేక్ సర్వేలు చేస్తున్న వారందరికీ ఈ వీడియో అంకితం.’ అని చెప్పుకొచ్చారు.

కాగా, టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించారు.ఎన్నికల వేళ టీఆర్ఎస్, బీజేపీ నేతలు డ్రామాలు చేస్తున్నారని మండిపడ్డారు.

తాజా వార్తలు