సినిమాలకు దూరం అవ్వడంపై సీనియర్‌ హీరోయిన్‌ కామెంట్స్‌

హీరోయిన్‌గా సుదీర్ఘ కాలం పాటు పలువురు ప్రముఖ హీరోల సరసన నటించిన రాశి ఆ తర్వాత కనిపించకుండా పోయింది.

హీరోయిన్‌గా చేస్తున్న సమయంలోనే రాశికి నిజం సినిమాలో వ్యాంప్‌ పాత్ర వచ్చింది.

మహేష్‌బాబు సినిమా అవ్వడంతో పాటు అప్పుడు దర్శకుడు తేజ ఓ రేంజ్‌ లో రికార్డు స్థాయి విజయాలను సాధించాడు.అందుకే ఆయన అడిగిన వెంటనే నిజం సినిమాలో నటించింది.

ఆ సినిమా తర్వాత రాశి అనూహ్యంగా కనిపించకుండా పోయింది.ఆ సినిమాలో రాశిని చూచి చాలా మంది అవాక్కయ్యారు.

రాశి ఇలాంటి పాత్ర చేసింది ఏంటీ అంటూ అంతా అభిప్రాయం వ్యక్తం చేశారు.అయితే రాశి మాత్రం సినిమాపై చాలా ఆశలు పెట్టుకుని చేసింది.

Advertisement
Senior Heroine Rashi Clarity About Break In Movies , Rashi, Movies, Film Indust

కాని సినిమా తలకిందు అయ్యింది.

Senior Heroine Rashi Clarity About Break In Movies , Rashi, Movies, Film Indust

ఆ సినిమా సక్సెస్‌ అయితే రాశికి మంచి ఆఫర్లు వచ్చేవి.కాని ఆ సినిమా నిరాశ పర్చింది.దాంతో అంతా కూడా తల కిందు అయ్యింది.

నిజం ఫ్లాప్‌ అవ్వడం వల్లే తాను సినిమా పరిశ్రమకు దూరం అవ్వాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది.ఆఫర్లు రాని సమయంలో పెళ్లి చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చాను.

పెళ్లి తర్వాత జీవితం చాలా హాయిగా సాగింది.దాంతో మళ్లీ సినిమాల్లో నటించాలనే ఆసక్తి కలగలేదు.

దానిమ్మ ర‌సంలో ఇవి క‌లిపి సేవిస్తే..ఆ జ‌బ్బులు మాయం!

పెళ్లి జీవితాన్ని ఆస్వాదిస్తున్న సమయంలోనే తల్లి అవ్వడం ఆ తర్వాత అమ్మతనాన్ని ఆస్వాదించడం చేశాను.అందుకే సినిమాలపై పెద్దగా ఆసక్తి కలగలేదు.

Advertisement

అందుకే సినిమాలకు చాలా ఏళ్లు బ్రేక్‌ ఇచ్చాను.ఇప్పుడు అమ్మగా నా బాధ్యత తగ్గింది.

కనుక ఇప్పుడు సినిమాలు చేయాలని భావిస్తున్నాను.మంచి ఆఫర్లు వస్తే తప్పకుండా నటించేందుకు సిద్దంగా ఉన్నాను.

సినిమాల కోసం బరువు తగ్గేందుకు కూడా సిద్దంగా ఉన్నట్లుగా చెప్పుకొచ్చింది.మరి రాశి కి ఎవరైనా ఆఫర్‌ ఇస్తారేమో చూడాలి.

తాజా వార్తలు