సుదీర్ఘ నిరీక్షణ తర్వాత అధికారంలో తెలంగాణలో అధికారం దక్కించుకున్న కాంగ్రెస్ నిన్న ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని కూడా పూర్తి చేసుకుంది.తన రెక్కల కష్టంతో కాంగ్రెస్ ను గెలిపించిన రేవంత్ రెడ్డి( Revanth Reddy ) అశేష ప్రజానీకం మధ్య ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయగా 11 మంది మంత్రులతో కూడా ప్రమాణ స్వీకారం చేయ్యించారు .
మంత్రి పదవి పొందిన వారిలో భట్టి విక్రమార్క(Mallu Bhatti Vikramarka ) కు డిప్యూటీ సీఎం పోస్టు తో పాటు రెవెన్యూ శాఖ కూడా లభించింది.ఉత్తంకుమార్ రెడ్డికి హోంశాఖ, సీతక్కకు గిరిజన సంక్షేమం శాఖ, కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మున్సిపల్ శాఖ, తుమ్మల నాగేశ్వరరావుకు రోడ్లు భవనాలు, పొన్నం ప్రభాకర్ కు బీసీ సంక్షేమం, శ్రీధర్ బాబుకు ఆర్థిక శాఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి భారీ నీటి నీటిపారుదల శాఖ, కొండా సురేఖకు మహిళా సంక్షేమం, దామోదర్ రాజనర్సింహంకు ఆరోగ్యశాఖ, జూపల్లి కృష్ణారావుకు పౌరసరఫరాల శాఖ కేటాయించినట్లుగా తెలుస్తుంది .
అయితే ఇందులో సీతక్క మరియు పొంగులేటి( Ponguleti Srinivas Reddy ), పొన్నం మాత్రమే మొదటిసారి మంత్రి పదవులు దక్కించుకున్నారు.మిగిలిన వారందరూ ఇంతకుముందు అనేక శాఖలకు మంత్రులుగా పనిచేసి విశేష అనుభవం గడించిన వారే .దాంతో ముఖ్యమంత్రి రేవంత్ కన్నా కూడా సీనియర్ మంత్రులుగా వీరు గుర్తింపు పొందుతున్నారు .క్యాబినెట్ కూర్పులో వైఎస్ ముద్ర ప్రత్యేకంగా కనిపిస్తుంది, ఎందుకంటే మంత్రి పదవి దక్కించుకున్న వారిలో వారిలో ఎక్కువమంది వైఎస్ అభిమానులుగా పేరు పొందారు.</br
అంతేకాకుండా సీనియర్ మంత్రులు కూడా అవ్వడంతో పరిపాలనలో వీరు స్వేచ్ఛగా వ్యవహరిస్తారని, వీరిని కట్టడం చేయడం రేవంత్ కు కొంత కత్తి మీద సామే అన్న విశ్లేషణ కూడా వినిపిస్తుంది.ఎందుకంటే వీరందరూ అధిష్టానంతో డైరెక్ట్ గా టచ్ లో ఉండడంతో పాటు పరిపాలన లో కూడా విశేష అనుభవం ఉన్నవారు కావడంతో పాలనలో తమదైన ముద్ర వేసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది.మొత్తంగా 18 మంది వరకు మంత్రి వర్గాన్ని విస్తరించే అవకాశం ఉన్న కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో 11 మంది మంత్రులతో సరిపెట్టి పరిస్థితులను బట్టి అవకాశాలను బట్టి మంత్రివర్గ విస్తరణ చేయాలని రేవంత్ నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తుంది.