కాస్టింగ్ కౌచ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన సీనియర్ నటి జయప్రద... వాళ్లే కమిట్మెంట్ ఇస్తున్నారంటూ?

తెలుగు సినీ ఇండస్ట్రీలో సీనియర్ నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో నటి జయప్రద( Jaya Pradha ) ఒకరు.ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు అందరి సరసన నటించి ఎన్నో సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ సినిమాలను అందుకున్నారు.

 Senior Actress Jayaprada Made Sensational Comments On The Casting Couch,jaya Pra-TeluguStop.com

ఇలా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగినటువంటి జయప్రద ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ రాజకీయాలలో చాలా బిజీగా మారిపోయారు.రాజకీయాల పరంగా ఎంతో బిజీగా ఉండే ఈమె తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె బాలీవుడ్( Bollywood ) హీరోయిన్ల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Telugu Bollywood, Jaya Pradha, Tollywood-Movie

ఈ సందర్భంగా జయప్రద మాట్లాడుతూ ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్నటువంటి పేర్లలో క్యాస్టింగ్ కౌచ్ ( Casting Couch )ఒకటి.అయితే మేము హీరోయిన్లుగా ఉన్న సమయంలో ఈ పేరు చాలా అరుదుగా వినే వాళ్ళమని,ప్రస్తుతం ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉంటుందనే విషయం అందరికీ తెలిసిపోయిందని తెలిపారు.మేం హీరోయిన్లుగా చేసే సమయంలో మాకు ఇలాంటి ఇబ్బందులు అసలు వచ్చేవి కాదని తెలిపారు.

ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నామంటూ బహిరంగంగా చెబుతున్నారు.

Telugu Bollywood, Jaya Pradha, Tollywood-Movie

ఇలా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ రావడానికి కారణం హీరోయిన్లే అంటూ ఈమె ఆరోపణలు చేశారు.అవకాశాలు రావాలి అంటే మనలో టాలెంట్ ఉండాలి.టాలెంట్ ఉంటే కచ్చితంగా సినిమా అవకాశాలు వస్తాయి అయితే ప్రస్తుత కాలంలో ముంబై నుంచి ప్రతి ఒక్కరు కూడా హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నారు.

ఇలాంటివారు అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తున్న సమయంలోనే దర్శక నిర్మాతలకు హీరోలకు వారే కమిట్మెంట్లు ఇస్తూ వారి పక్కలోకి వెళ్తున్నారు అంటూ ఈ సందర్భంగా జయప్రద చేసినటువంటి ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube