అలా బాహుబలి సినిమా అవకాశం కోల్పోయాను.. సీనియర్ నటి జయ చిత్ర కామెంట్స్!

ఒకానొక సమయంలో వెండితెరపై గ్లామర్ హీరోయిన్ గా ఓ మెరుపు మెరిసారు నటి జయ చిత్ర.80 లలో అగ్రతారగా వెండితెరపై మెరిసిన ఈమె చాలా కాలం తర్వాత పొన్నియన్ సెల్వన్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.అప్పట్లో శోభన్ బాబు, కృష్ణ, కృష్ణంరాజు వంటి సీనియర్ హీరోల సరసన నటించినటువంటి ఈమె సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా ఎంతోమంది యంగ్ హీరోలకు తల్లి అత్త పాత్రలలో సందడి చేశారు.ఇకపోతే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె ఎన్నో ఆశక్తికరమైన విషయాలను వెల్లడించారు.

 Senior Actress Jayachitra Comments On Missing Bahubali Shivagami Role Details, B-TeluguStop.com

ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ…ఎన్నో సినిమాలలో హీరోయిన్ గా నటించిన తనకు సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా ఎంతో అద్భుతమైన పవర్ఫుల్ అత్త పాత్రలలో నటించే అవకాశాలు వచ్చాయి.అయితే తన సెకండ్ ఇన్నింగ్స్ లో తనకు ఓ లోటు అలాగే ఉందని ఆ విషయంలో తాను ఇప్పటికే అసంతృప్తిగా ఉండాలని జయచిత్ర పేర్కొన్నారు.

తాను హీరోయిన్గా నటించే సమయంలో వచ్చిన సినిమా అవకాశాలన్నింటినీ చేసుకుంటూ వెళ్లే దాన్ని అయితే ఒక సీరియల్ లో మాత్రం తాను నటించే అవకాశం కోల్పోయానని ఈమె తెలిపారు.

 Senior Actress Jayachitra Comments On Missing Bahubali Shivagami Role Details, B-TeluguStop.com

తెలుగు బుల్లితెరపై ప్రసారమైన మంగమ్మగారి మనవడు అనే సీరియల్ లో నటించే అవకాశం తనకు వచ్చింది.

అయితే కొందరు ఉద్దేశపూర్వకంగా తనకు ఈ సీరియల్ లో నటించడం ఇష్టం లేదని చెప్పడంతో తనకు ఈ సీరియల్లో నటించే అవకాశం చేజారిపోయిందని తెలిపారు.అయితే ఈ సీరియల్ కు డైరెక్టర్ గా రాఘవేంద్రరావు బంధువులు వ్యవహరించారు.రాజమౌళి గారి గెస్ట్ హౌస్ లో ఉంటూ ఈ సీరియల్ చేయడానికి తాను ఒప్పుకున్నప్పటికీ మధ్యలో లేనిపోని ఊహగానాలతో నాకు ఈ అవకాశం రాకుండా చేశారు.లేకపోతే తను ఈ సీరియల్ లో నటించి ఉంటే బాహుబలి సినిమాలో శివగామి పాత్ర తప్పకుండా తనకే వచ్చేదని ఈ సీరియల్ మిస్ కావటం వల్ల ఆ పాత్ర కూడా కోల్పోయానని ఈమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Video : Senior Actress Jayachitra Comments On Missing Bahubali Shivagami Role Details, Baahubali Movie,actress Jaya Chitra,Shobhan Babu, Krishna Krishnamraju, Senior Actress Jayachitra , Missing Bahubali Shivagami Role, Rajamouli #TeluguStopVideo

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube