Actor Sivakrishna: రానా నాయుడు వెబ్ సిరీస్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన నటుడు శివకృష్ణ.. ఏం అన్నారంటే?

టాలీవుడ్ అగ్ర హీరో వెంకటేష్, హీరో రానా( Venkatesh Rana ) నటించిన తాజా వెబ్ సిరీస్ రానా నాయుడు.

( Rana Naidu ) ఈ వెబ్ సిరీస్ ను అధికారికంగా ప్రకటించినప్పటి నుంచి ఏదో రకమైన వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.

మొన్నటికి మొన్న అభిమానులు హీరో వెంకటేష్ పై మండిపడిన విషయం తెలిసిందే.అలాగే రానా నాయుడు వెబ్ సిరీస్ దారుణంగా ఉంది అంటూ నిటిజన్ సైతం ట్రోల్స్ చేసిన విషయం తెలిసిందే.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ రామానాయుడు వెబ్ సిరీస్ పై సీనియర్ నటుడు శివకృష్ణ( Senior Actor Sivakrishna ) సంచలన వ్యాఖ్యలు చేశారు.తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న శివ కృష్ణ రానా నాయుడు వెబ్ సిరీస్ గురించి మాట్లాడుతూ.

తాజాగా ఒక వెబ్ సిరీస్ చూశాను.మరి దారుణంగా ఉంది.ఆల్మోస్ట్ అది ఒక బ్లూ ఫిలిం అని చెప్పవచ్చు.

Advertisement

ఈ మధ్యకాలంలో ఇటువంటి దారుణమైన సినిమాలు చూడలేదు.మన సంస్కృతి కల్చర్ కాదు.

అసలు ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన సినిమానా అది అంటూ రానా నాయుడు వెబ్ సిరీస్ పై మండిపడ్డారు.అసలు ఇంట్లో బెడ్ రూమ్ కిచెన్ ఎందుకు ఉంటాయి.

భార్యాభర్తలు బెడ్రూంలో పడుకుంటారు బెడ్ రూమ్ తలుపులు తీసి ఉంచడం పిల్లలు అది చూడటం ఏంటి.మన సంప్రదాయం ఇదేనా.

మన సంస్కృతి ఏమైపోతోంది అంటూ మండిపడ్డారు.ఇటువంటి వాటి వల్ల పిల్లలు చెడిపోతున్నారు.

వీడియో: పాకిస్థాన్‌లో ప్రాంక్ చేసిన యువకులు.. లాస్ట్‌కి దిమ్మతిరిగే ట్విస్ట్..?
వైరల్ వీడియో : కారుతో ఢీకొట్టి పరారైన బీజేపీ అధ్యక్షుడి కుమారుడు..

దేశ ఆర్థికంగా పతనమైనా తిరిగి కోలుకుంటోంది.

Advertisement

కానీ సంస్కృతి పరంగా పతనమైతే ఆ దేశాన్ని కాపాడడం కష్టం.సినిమాల్లో బూతు ఉంటే థియేటర్స్ కి వచ్చిన వారికి మాత్రమే అది తెలుస్తుంది అదే వెబ్ సిరీస్ లో అలా కాదు ఇలాంటివి చూడకుండా పిల్లలను నియంత్రించడం చాలా కష్టం అవుతుంది అంటూ మండిపడ్డారు శివకృష్ణ.ఓటీటీ కంటెంట్ కు కూడా సెన్సార్ ( Censor ) ఉండాలి అని తెలిపారు.

అయితే శివకృష్ణ రామానాయుడు వెబ్ సిరీస్ ను ఉద్దేశించి ఈ విధంగా కామెంట్స్ చేశారని నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

తాజా వార్తలు