ఇప్పుడున్న పరిస్థితులలో ఒక సినిమా తీసి అది విడుదల చేయడం అంటే తల్లి పురిటి నొప్పులు పడి బిడ్డకు జన్మ ఇచ్చినంత ఇబ్బందులు ఉంటున్నాయి.ఏ సినిమా అయినా కథ సిద్ధం చేసుకుని ఏ హీరోతో చేస్తే బాగుంటుంది, ఎవరికి కథ వినిపిస్తే బాగుంటుంది అనుకోని ఒక నిర్ణయానికి రావడం కొంత భాగం అయితే అసలు తను అనుకున్న హీరోతో ఆ సినిమా కథను ఓకే చేయించుకోవడం మరింత కష్టం తో కూడుకున్న పని.
ఇక కొన్నిసార్లు ఒక హీరోతో సినిమా అనుకోని మరో హీరోతో కూడా సినిమా చేస్తూ ఉంటారు.అలాగే కొంతమంది రిజెక్ట్ చేసిన కథను మరికొంతమంది హీరోలు ఓకే చేస్తుంటారు.
దాన్ని హిట్టు కూడా కొడుతుంటారు.ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఉంటాయి.
ఇక సూపర్ హిట్ సినిమాకైతే ఇలాంటి కథలు ఎన్నో ఉంటాయి.

అయితే ఇండస్ట్రీలోనే ఒక సెన్సిబుల్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న శేఖర్ కమ్ముల కు కూడా తన సినిమా విషయంలో ఇలాంటి ఒక అనుభవం ఉంది.అతడు మొదట్లో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసేవాడు.కానీ సినిమా అంటే ఎంతో ఇష్టం అందుకే ఆ ఉద్యోగాన్ని సైతం వదులుకొని ఇండస్ట్రీకి వచ్చారు.
ఫ్యామిలీ అలాగే ఫ్రెండ్స్ సపోర్ట్ తో మొదట డాలర్ డ్రీమ్స్ అనే ఒక సినిమాను తీసి అద్భుతంగా ఉంది అని అందరి చేత శభాష్ అనిపించుకున్నాడు.ఈ సినిమాకు శేఖర్ కమ్ముల ( Sekhar Kammula )ఉత్తమ జాతీయ అవార్డు కూడా అందుకున్నాడు.
ఇక ఆ తర్వాత అతడు తీసిన మరో సినిమా ఆనంద్.

ఆనంద్ సినిమా( Anand movie ) అప్పట్లో మంచి కాఫీలాంటి సినిమాగా పేరు సంపాదించుకుంది కానీ ఈ సినిమా తీయడానికి శేఖర్ కమ్ముల చాలా ప్రయత్నాలు చేయాల్సి వచ్చింది.ఈ సినిమా కథ వినిపించడానికి అతడు ఎక్కని స్టూడియో లేదు అడగని హీరో లేడు.కానీ ఎవ్వరూ ఒప్పుకోకపోవడం తో తానే సొంతంగా నిర్మాణం చేయాలని డిసైడ్ అయ్యి హీరో రాజా( Raja )తో ఆ సినిమా తీశాడు.
ఇక 40 లక్షల రూపాయల వరకు ఎన్ఎఫ్ డి సి అనే సంస్థ కూడా అతనికి డబ్బు ఇచ్చింది.మిగతా డబ్బు తన ఫ్రెండ్స్ దగ్గర నుంచి అప్పు చేసి మరి సినిమా తీశాడు.
కానీ ఆ సినిమాను విడుదల చేయడానికి ఎవరు ముందుకు రాకపోకపోవడంతో డిస్ట్రిబ్యూషన్ కూడా తానే సొంతంగా చేయాలని ఆంధ్రప్రదేశ్ లో ఒక ఐదు థియేటర్లో మాట్లాడుకొని విడుదల చేశాడు.ఆ తర్వాత మెల్లిగా విడుదలైన రెండు మూడు రోజులకు వచ్చి చాలామంది డిస్ట్రిబ్యూటర్స్ వచ్చి ఆ సినిమా రైట్స్ అడిగారు.
ఎవరు ఎంత ఇస్తే అంత తీసుకొని ఆ సినిమాని వారికి అప్పగించాడు.ఆలా రాష్ట్రం మొత్తం ఈ సినిమా విడుదల అయ్యింది.అలా రెండు కోట్ల 30 లక్షలతో సినిమా తీసిన శేఖర్ కమ్ముల ఒక కోటి రూపాయల వరకు లాభాన్ని సంపాదించుకున్నాడు.