రెండు సినిమాలకు ఇదే మంచి ఛాన్స్..!

ప్రతి శుక్రవారం లానే ఈ శుక్రవారం కూడా రెండు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.అయితే ఈ రెండు సినిమాలు ఆసక్తికరంగా ఉండటమే ఇక్కడ విశేషం.

కళ్యాణ్ రామ్ హీరోగా వశిష్ట డైరక్షన్ లో వస్తున్న బింబిసార టీజర్, ట్రైలర్ తో ఆడియెన్స్ ని అలరించింది.సినిమా కూడా ఆశించిన స్థాయిలో ఉండేలా ఉంది.

కళ్యాణ్ రామ్ చాలా కాన్ఫిడెంట్ గా ఈ సినిమాతో హిట్ కొట్టేస్తున్నామని చెబుతున్నాడు.బింబిసార ప్రచార చిత్రాలు చూస్తే సినిమా తప్పకుండా అలరించేలా ఉంది.

ఇక మరోపక్క దుల్కర్ సల్మాన్ తో హను రాఘవపుడి చేసిన సీతారామం కూడా శుక్రవారం రిలీజ్ అవుతుంది.ఈ సినిమా కూడా సూపర్ బజ్ ఏర్పరచుకుంది.

Advertisement

సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించగా రష్మిక మందన్న, సుమంత్ లు కూడా ఇంపార్టెంట్ రోల్ లో నటించారు.సీతారామం సాంగ్స్, ట్రైలర్ కూడా సినిమాపై ఆసక్తిని పెంచాయి.

కొన్నాళ్లుగా తెలుగు సినిమా బాక్సాఫీస్ వెల వెలబోతుంది.ఈ రెండు సినిమాలకు ఇదే మంచి ఛాన్స్ అని చెప్పొచ్చు.

పోటీగా సినిమాలేవి లేకపోవడంతో సినిమాలో ఏమాత్రం విషయం ఉన్నా సినిమా హిట్ అనే చెప్పొచ్చు.బింబిసార సినిమా చారిత్రక కథతో విజువల్ ఫీస్ట్ గా ఉండబోతుంది.

సినిమా రిలీజ్ కు ముందే బింబిసారకి పాజిటివ్ టాక్ వచ్చింది.ఇక సీతారామం సినిమా కూడా చాలా ప్లెసెంట్ గా ఉండబోతుందని అర్ధమవుతుంది.

పోలింగ్ ఏజెంట్ల నియామకంపై ఈసీ ఆదేశాలు
తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?

మహానటి ప్రొడక్షన్ నుంచి వస్తున్న ఈ సినిమా కూడా సైలెంట్ హిట్ కొట్టేలా ఉంది.సో ఎలా చూసినా రెండు సినిమాలు మంచి టాక్ తెచ్చుకుంటే రెండిటికి మంచి వసూళ్లు వచ్చే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు.

Advertisement

 వారంలో మళ్లీ మరో మూడు సినిమాలు బాక్సాఫీస్ ఫైట్ లో వస్తుండగా ఈ వారంలోనే ఈ రెండు సినిమాలు వసూళ్లతో లాభాలు తెచ్చుకోవాల్సి ఉంటుంది.

తాజా వార్తలు